బ్రహ్మోత్సవాలు: గరుడ వాహనంపై శ్రీవారు
, మంగళవారం, 4 అక్టోబరు 2011 (12:51 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవమైన వాహనసేవ గరుడ వాహనం. అందుకే తిరుమల గిరులపై గరుడవాహన సేవకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. గరుడుడు విష్ణువు యొక్క ప్రధాన మరియు రోజువారీ వాహనం. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున ధ్వజారోహణంతో గరుడుడు ఉన్నతస్థానం.. అంటే ధ్వజస్తంభం శిఖరాన ఆశీనులై స్వర్గం నుంచి భువికి శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించాల్సిందిగా ఆహ్వానిస్తారని విశ్వాసం. విష్ణు వాహనమైన గరుత్మంతుడు ఈ బ్రహ్మోత్సవాలన్నిటినీ పర్యవేక్షిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అంతటి బ్రహ్మాండమైన ఉత్సవం కనుకనే భక్తులు ఈ గరుడోత్సవానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇకపోతే గరుడోత్సవంనాడు పుత్తూరు ఆలయం మరియు చెన్నై నుండి అలంకరించబడిన గొడుగులను నుండి తులసి దండలు సంప్రదాయ బహుమతులు ప్రత్యేకంగా సమర్పించబడతాయి.
అంతేకాదు ఈ గరుడ సేవను ఆసియా మరియు దక్షిణ ఆసియా దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో ప్రముఖంగా జరుపుకోవడం కనబడుతుంది.