తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు తిరుమాడవీధుల్లో దివ్యరథంపై తిరుమల శ్రీనివాసుడు విహరించాడు. రథంపై స్వామి దర్శనం అత్మానాత్మ వివేకం కలిగిస్తుందని భక్తుల నమ్మకం. పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడంతో తిరుమల భక్తులతో పోటెత్తింది.
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అలాంటి రథ సేవలో పాల్గొనేందుకు భారీ స్థాయిలో భక్తులు తిరుమల కొండకు తరలివచ్చారు.