తిరుమల బ్రహ్మోత్సవాలు చక్రస్నానం ఘట్టంతో పరిసమాప్తం
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం చేశారు. ఎనిమిది రోజుల పాటు వివిధ రకాల వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నాన ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయడంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి.