కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం స్వామి వారు చిన్నశేషవాహనంపై దర్శనమిచ్చారు. గురువారం ఉదయం భక్తకోటి గోవింద నామ స్మరణతో తిరుమల కొండ మారుమోగుతుండగా, మలయప్పస్వామి సర్వాలంకరణాభూషితుడై తిరుమాడ వీధుల్లో ఊరేగారు.
శేషశయనుడైన మలయప్ప స్వామి చిన్నశేషునిని వాహనంపై ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలివచ్చారు. మురళీకృష్ణుడిగా ఆలమందలతో చిన్నశేషవాహనంపై వెంకన్న ఊరేగిన తీరు భక్తులకు కనువిందు చేసింది.
ఇదిలా ఉండగా, "అనంత స్వర్ణమయ" పథకానికి విరాళాలు వెల్లువల్లా వస్తున్నాయని టీటీడీ వెల్లడించింది. కర్ణాటక సీఎం యడ్యూరప్ప శ్రీవారి దర్శనార్థం వచ్చిన సందర్భంగా ఆయన స్నేహితులు పదికోట్ల విలువైన 24 క్యారెట్ల మేలిమి బంగారం విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.