అశ్వవాహనంపై విహరించిన మలయప్పస్వామి
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు శనివారం రాత్రి అశ్వవాహనంపై విహరించాడు. కలి ప్రభావం నుంచి భక్తులను కాపాడి దుర్మార్గులను శిక్షిస్తానని అశ్వ వాహనంపై తిరు వీధుల్లో శ్రీమలయప్ప స్వామి విహరించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం లోకాన్ని ఉద్దరించడానికి కలియుగంలో అవతారమూర్తిగా శ్రీనివాసుడు వెలిసినట్టుగా శ్రీవేంకటాసల మహత్యం పేర్కొంది. శ్రీమలయప్పస్వామి కల్కి అవతారంలో వహానాన్ని అధిరోహించి, ఒక చేతిలో అశ్వం కళ్లెంను చేతబూని, మరొక చేతిలో చెర్నాకోలును ధరించి అశ్వ వాహన సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అంతకుముందు ఉదయం మహారథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన విషయం తెల్సిందే.