Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మోత్సవాలు... ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు... భక్తులకు ఎలాంటి భాగ్యం(వీడియో)

Advertiesment
muthyapu pandiri vahanam
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (19:15 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవరోజు శుక్రవారం రాత్రి శ్రీవేంకటేశ్వరుడు ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. బకాసురుడిని వధించిన బాలకృష్ణుని అవతారంలో మలయప్ప స్వామి ఉభయదేవేరిలతో కలసి తిరువీధులలో విహరిస్తారు. ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు, సుంకాలు, ఇతర బహుమతులను భద్రపరచిన ప్రభువు కరువు కాటకాలు, క్లిష్ట పరిస్ధితులలో ప్రజలను అదుకుంటారన్నదే.. ఈ వాహన సేవలోని పరమార్ధం. 
 
శేషుని పడగల నీడలో స్వామి ముత్యపు పందిరిలో నిలిచినట్లు పద్మపురాణంలో చెప్పబడింది. నిర్మలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను మించి ప్రకాశిస్తున్న విద్యుద్దీపాల వెలుగులో దేదీప్యమానంగా ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు నయనానందకరంగా దర్శనమిస్తారు. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్న వేంకటేశ్వర స్వామి వారి దర్శనం భక్తులలోని తాపత్రాయలను పోగొడుతుందని విశ్వాసం.
 
స్వాతికార్తెలో వాన చినుకు సముద్రంలోని ముత్యపు చిప్పలో పడి మంచి ముత్యంగా మారిన్నట్లే ఈ వాహన సేవలను తిలకించిన భక్తులు చిత్త చాపల్యాన్ని పొగొట్టుకొని నిర్మల హృదయులుగా మారుతారని ఈ వాహన సేవలోని అంతరార్థం.

Share this Story:

Follow Webdunia telugu