తిరుమలలో శ్రీవారి గరుడోత్సవం సందర్భంగా ఓ అద్భుతం చోటుచేసుకుంది. శ్రీవారి గుడిలో రామచిలుక ప్రత్యక్షమై సంభ్రమాశ్చర్యాలకు గురిచేయగా గరుడసేవకు ముందు ఫోటోలు తీస్తున్న సమయంలో స్వామివారి సమీపం నుంచి మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం ఆవిష్కృతమైంది. ఈ కాంతిపుంజాన్ని చూసిన భక్తుల వళ్లు పులకరించిపోయింది.
స్వామివారే స్వయంగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారని భక్తులు గోవింద నామస్మరణతో భక్తిసాగరంలో మునిగిపోయారు. కాగా ఈ అద్భుత ఘటనపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మాట్లాడుతూ... స్వామివారు ఇలా కాంతిపుంజం రూపంలో భక్తులకు దర్శనమిచ్చారనీ, తన దివ్యమైన తేజస్సుతో భక్తులకు దీవెనలు అందించారని పేర్కొన్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు తిరుమలో వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.