కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టే అంకురార్పణ కార్యక్రమం మంగళవారం రాత్రి వైభవంగా ముగిసింది. శ్రీవారి సర్వసైనాధ్యక్షుడైన విష్వక్సేనుడు ఊరేగింపు ప్రారంభ సందర్భంలో వరుణుడు చిరుజల్లులతో స్వామి వారిని పలకరించాడు.
చిరుజల్లుల ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అంకురార్పణ కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. తిరుమాడ వీధుల్లో సేనాధిపతి ఊరేగింపు పూర్తయ్యే వరకు వరుణుడు చిరుజల్లులను కురిపిస్తూనే ఉన్నాడు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమానికి తితిదే పాలకమండలి ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు, ఈవో రమణాచారి జేఈవో శేషాద్రి వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.