Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ వచ్చి నీ చుట్టూ రౌండ్ కొడతా...

హైదరాబాద్ వచ్చి నీ చుట్టూ రౌండ్ కొడతా...
WD
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎపీ ఎక్స్‌ప్రెస్ కదిలేందుకు సిద్ధంగా ఉంది. ట్రైన్‌లో కూర్చున్న అశోక్ చూపులు మాత్రం ఆతృతగా ప్లాట్‌ఫాం అంతటినీ వెతికేస్తున్నాయి. తను ఎదురుచూస్తున్న ప్రియసఖి సుజాత పరుగులాంటి నడకతో రానే వచ్చింది. హడావిడిగా కంపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చిన సుజాత...

అశోక్.. మా నాన్న మన పెళ్ళకి గ్రీన్ సిగ్నల్ యిచ్చాడు. అతికష్టంమీద మా నాన్నని ఒప్పించా. నువ్వు ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన తర్వాత ఢిల్లీలో రౌండ్లు కొట్టకుండా త్వరగా వచ్చెయ్.. ఆయాసంతో వొగరుస్తూ చెప్పింది.

నేనేం ఢిల్లీలో రౌండ్లు కొట్టను. ఇదిగో నా రిటన్ టికెట్ అని టికెట్ చూపించి... హైదరాబాద్ వచ్చి నీ చుట్టూ రౌండ్ కొడతాలే... అన్నాడు చిలిపిగా. ట్రైన్ కదిలింది.

హైదరబాద్ వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైందన్న వార్త విన్న సుజాత కుప్పకూలింది. మరో ఆలోచన లేకుండా చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. సమయం మధ్యాహ్నం రెండు గంటలు. ఇంట్లో తల్లిదండ్రులిద్దరూ లేరు. ఇదే మంచి సమయం అనుకుంది సుజాత.

నా చావుకి ఎవరూ బాధ్యులు కారు- అని రాసినదాన్ని మళ్ళీ చదివుకుంది సుజాత. గుప్పెట్లో నిద్ర మాత్రలు తీసుకుని వేసుకోబోతుండగా.... సెల్ మోగింది... అసహనంగా ఓ చేత్తో ఫోన్ అందుకుంది.

హలో సుజా... దిసీజ్ అశోక్... హౌ ఆర్ యూ. షాక్ అయ్యావా... నేను చనిపోలేదు డార్లింగ్... నీ చుట్టూ రౌండ్లు కొట్టాలనే దేవుడు బతికించాడేమో... అంటూ అశోక్ చెపుతున్న మాటలు క్షణ కాలం ఆలస్యమయ్యుంటే... ఓహ్ ఊహించడానికే సాధ్యం కాలేదు సుజాతకు.

సుజాత నుంచి ఒక్క మాట కూడా లేకపోవడంతో... ఏయ్ మొద్దూ ఏం ఆలోచిస్తున్నావ్... అన్నాడు. మూగగా రోదిస్తూ... నీకు భగవంతుజు పునర్జన్మ ఇచ్చాడో లేదో కానీ నాకు మాత్ర ఇచ్చాడు అశోక్ అని మనసులో అనుకుంటూ... "నీ రాక కోసం ఈ ముద్దబంతి ఎదురు చూస్తూ ఉంటుంది" అంది.

Share this Story:

Follow Webdunia telugu