Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మయూరి నడకలు

మయూరి నడకలు
, మంగళవారం, 15 ఏప్రియల్ 2008 (11:25 IST)
ఒక అందాల సుందరి అతని వైపు అలవోకగా చూస్తూ చిరునవ్వులు నవ్వుతోంది. దాదాపు నెల రోజుల నుంచి అలానే జరుగుతోంది. 'ఎలాగైనా ఈ రోజు కొద్దిగా ధైర్యం చేయ్ గురూ' అంది రాకేష్ అంతరాత్మ. అంతే కుడి చేతిని పైకెత్తి వూపాడు. టాటా చెప్తున్నట్లుగా కొంచెం సీరియస్ అయింది ఆమె ముఖం.

బహుశా కోపం వచ్చిందేమో ?' అనుకొని వెళ్ళిపోబోయాడు బాధపడుతూ. అప్పుడు ఆమె కుడి చెయ్యి బయటపెట్టి ఊపింది టాటా చెప్తున్నట్లుగా.
"హుర్రే" అని ఆనందంగా కేకలేస్తూ వెళ్ళి పోయాడు ఆఫీసుకి. ఆ తర్వత ప్రతి రోజూ రాకేష్ టాటా చెప్పడం మామూలైపోయింది. రాకేష్ హృదయం అంతా ఆమె రూపమే, ఆమె తలపులే.ఆమె పేరు కనుక్కున్నాడు. అందానికి తగ్గట్లు ఎంత అందమైన పేరో ఆమెది మయూరి. అని ఆనందంగా కొలీగ్ వంశీకి చెప్పాడు. రాకేష్‌కు రోజులు, నెలలూ ఆనందంగా గడవ సాగాయి. ఒకరోజు-

"బాబూ రాకేష్! మీ మావయ్య పెళ్ళికి తొందర పెడుతున్నారు. నీ అభిప్రాయం కూడా చెప్తే ముహూర్తాలు పెట్టించేస్తాను." అన్నాడు తండ్రి
మామయ్య కూతురు రాజ్యం భయంకర రూపం గుర్తుకు వచ్చింది. అంతలోనే మయూరి రూపం వెలిసింది. ''మయూరిని తప్ప మరెవరినీ పెళ్ళి చేసుకోను. ఆమె తల్లిదండ్రుల అభిప్రాయం కనుక్కొని ముహూర్తాలు పెట్టించండి." అని ఖచ్చితంగా చెప్పేశాడు.

కొడుకు పట్టుదల చూసి మయూరి వాళ్ళింటికి వెళ్ళి వచ్చారు రాకేష్ తల్లిదండ్రులు. "బాబూ మయూరి తల్లిదండ్రులు ఆనందంగా సమ్మతిని వ్యక్తంచేశారు. కానీ మాకే సమ్మతి లేదు.అదీ ఎందుకంటే ఆ అమ్మాయికి రెండు కాళ్ళు చిన్నప్పుడే పోలియో వచ్చి చచ్చుబడిపోయాయి. "అన్నారు జాలిగా. రాకేష్ అప్‌సెట్ అయి ఆఫీసుకు సెలవు పెట్టేశాడు. తర్వాత మామ కూతురుతో పెళ్ళికి సమ్మతించాడు.

'కాళ్ళు లేని మయూరిని చేసుకునే ఆదర్శం నాలో లేదే అని ఎన్నోసార్లు బాధపడ్డాడు. క్యూలో నిల్చొని వున్న రాకేష్‌ని చూసి
"హల్లో! బాగున్నారా ? కన్పించి చాలా కాలమైంది." అని పలకరించింది మయూరి. ఆమె కాళ్ళ వైపు చూడగా అందంగా ఉన్నాయి.
"వస్తానండీ! సినిమా టైం అవుతోంది" అని నెమలిలా నడచుకుంటూ వెళ్ళిపోయింది మయూరి.
తల్లిదండ్రులు కట్నం కోసం మయూరికి కాళ్ళు లేవన్న అబద్దం చెప్పారన్న విషయాన్ని తర్వాత తెలుసుకొని కుమిలిపోయాడు రాకేష్.

Share this Story:

Follow Webdunia telugu