Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలలను మాయం చేసే ప్రేమానంద స్వామి

Advertiesment
బాలలను మాయం చేసే ప్రేమానంద స్వామి
ప్రేమానందస్వామి బోధనలు వినేందుకు వచ్చే జనంలో పిల్లలే ఎక్కువ సంఖ్యలో వుంటారు. అందుకు కారణం బోధనలు పూర్తయిన తర్వాత బాలలకు స్వామి ప్రత్యేకంగా పైవ్‌స్టార్ చాక్లెట్లు యివ్వడమే. స్వామి వారు ఏకాంతంలో వుండగా కూడా బాలలెవరైనా వస్తే వారితో నవ్వుతూ మాట్లాడి చాక్లెట్ యిచ్చి పంపుతాడు.

ఓరోజు స్వామివారు ఏకాంత సమయంలో వుండగా బాబు అనే ఎనిమిదేళ్ళ బాలుడు వచ్చాడు. " రాబాబూ" అని నవ్వుతూ పిలిచాడు బాలానంద స్వామి. దాదాపు అరగంటసేవు స్వామిని రకరకాల ప్రశ్నలు వేశాడు బాబు. ఓపికగా సమాధానం చెప్పాడు స్వామి. తర్వాత బాబు చేతికి ఫైవ్‌స్టార్ చాక్లెట్ యిచ్చాడు. అప్పుడు.... తరుణ్ అనే ఓ ముప్పయి సంవత్సరాల భక్తుడు ప్రవేశించి... మీరు చాక్లెట్లు యిచ్చేది పిల్లలకేనా? మాలాంటి భక్తులకు కనీసం మీ దర్శనం కూడా కష్టమే. ఎందుకు స్వామీ ఈ తేడా? అని ప్రశ్నించాడు.

పిల్లల్ని ఆనందంపరచడమేనా నాధ్యేయం. అన్నాడు నవ్వుతూ స్వామీజీ. చాక్లెట్లు లేకపోయినా తీర్థ ప్రసాదాలయినా మాకివ్వవచ్చుగా అన్నాడు తరుణ్. మీకు తీర్థప్రసాదాలు యిచ్చేందుకు ఎందరో వున్నారు.. వీళ్ళకు లేరుకాబట్టే నేనిస్తున్నాను అంటూ బాబు వైపు చూపించాడు స్వామీజీ... అటువైపు చూసిన తరుణ్ కంటికి ఆవురావురు మంటూ చాక్లెట్ తింటున్న బాబు కన్పించాడు. కొన్ని ఆథ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని వెళ్ళిపోయాడు తరుణ్.

వారం రోజుల తర్వాత తరుణ్ ప్రేమానందస్వామి ఆశ్రయానికి వచ్చాడు. తరుణ్‌గా కాకుండా డీఎస్‌పీ తరుణ్‌గా సపరివారంతో వచ్చి.... స్వామీ తమర్ని అరెస్టు చేస్తున్నాను అన్నాడు. ఎందుకు నాయనా? కంగారు కప్పిపుచ్చుకుంటూ ప్రశ్నించాడు స్వామి. ఎందుకేమిటిరా...? అమయాక బాలల్ని మత్తు చాక్లెట్లతో మోసగించి విదేశాలకు బానిసలుగా అమ్ముతున్నందుకు అన్నాడు కటువుగా.

గట్టిగా అరవకు భక్తా... కావాలంటే ఆశ్రమమంతా వెతుకు. నీకెవరూ మత్తులో వున్న బాలలు కన్పించరు తెలిసిందా? చెప్పాడు స్వామి. ఇక్కడెందుకుంటారురా వెధవా... రా నాతోపాటు.. అంటూ స్వామి చేతికి బేడీలువేసి జీప్‌లో ఎక్కించుకున్నాడు. జీప్ ఒక మారుమూల ప్రదేశంలోని బంగ్లాముందు ఆంగింది. అక్కడ పిల్లల్ని విదేశాలకు ఎగుమతి చేసే బృందం చేతులకు బేడీలతో కన్పించింది. అది చూసిన స్వామి తత్తరపోయాడు.

తత్తరపడకురా దొంగ స్వామీ... బాబూ... యిలారా! అంటూ తరుణ్ పిలిచిన వెంటనే బాలల గుంపులోంచి నవ్వుతూ వచ్చాడు బాబు. ఒరేయ్ బానిసస్వామీ నీట్రాప్‌లో పడని ఏకైక బాలుడు ఈ బాబు. ఈ బాలుడు నువ్విచ్చిన చాక్లెట్లు తినకుండా తన జేబులోనివి తింటూ నీముందు నటించేవాడు. ఈ బాబు ఎవరో తెలుసా?... నా ఏకైక కొడుకురా|.. నీలాంటి వెధవని పట్టుకునేందుకు నా బిడ్డనే పణంగా పెట్టాను. ఇదిగో వీడిజేబులోని పెన్నులోని మైక్రోఫోన్ ద్వారా ఈ స్థలాన్ని డిపార్ట్‌మెంటు కనుక్కుంది. పదరా వెధవా స్టేషన్‌కి అంటూ స్వామిని వ్యాన్‌లోకి నెట్టాడు తరుణ్.

గుంపుగా వున్న పిల్లలందరూ స్వాములు కాని ఎవరన్నా తెలియని వారుకాని చాక్లెట్లు యిస్తే తొందరపడి తినకూడదు. స్కూలు నుండి యింటికి వచ్చేటప్పుడు తెలియని వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళకూడదు. అన్నాడు తరుణ్. నిజం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు, ప్రజలు గుంపుగా ఆ బంగ్లావద్దకు వచ్చారు. చూడండి పిల్లలకు యింటి దగ్గర తల్లిదండ్రులే తగు జాగ్రత్తలు చెప్పాలి. అంటూవచ్చిన వారితో చెప్పి వారి పిల్లల్ని అప్పగించాడు తరుణ్. అందరూ బాబు తెలివికి అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu