Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలి మత్తులో చిత్తయిన ఓ "మొగుడు"

Advertiesment
ప్రియురాలి మత్తులో చిత్తయిన ఓ
ఏమండీ ఈ మధ్య మీరు ఆఫీసు నుంచి చాలా లేట్‌గా ఇంటికి వస్తున్నారు.. కాఫీ కప్పు చేతికిస్తూ భర్తను అడిగింది జయ.
ఏం రాకూడదా...? తల పక్కకి తిప్పకుండా ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు శ్రీను.

శ్రీను, జయలది ప్రేమ వివాహం. పెళ్ళయి ఐదేళ్ళు గడిచాయి. ఓ పాప, బాబు కలిగారు వారికి. కానీ ఆర్నెల్ల నుండి శ్రీను ప్రవర్తనలో ఏదో మార్పు కన్పించసాగింది జయకి.

మిమ్మల్ని గురించి ఇరుగుపొరుగు రకరకాలుగా అనుకుంటున్నారండీ... అంది నెమ్మదిగా
ఏమని? మా ఆఫీసులో టైపిస్టు షీలాతో పరిచయం వుంది తిరుగుతున్నాడనా? అదే అయితే నువ్వేం బాధపడనక్కరలేదు. త్వరలో ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నాను. ఎంతో ఖచ్చితంగా చెప్పాడు శ్రీను.

మరి అటువంటప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించి ఎందుకు పెళ్ళి చేసుకున్నావు? అప్పుడే ఇంట్లోకి వస్తూ కొడుకు మాటలు విన్న తండ్రి ప్రశ్నించాడు. అది నా యిష్టం. నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళు కన్న తండ్రినే కసిరాడు. చేసేది లేక ఆయన నిట్టూర్చాడు.

అలా కాలం దొర్ల సాగింది. శ్రీను అన్నంత పనీ చేశాడు. షీలాతో చట్టబద్దత లేని వివాహం చేసుకుని ఆమె వద్దే ఉంటున్నాడు. దీంతో జయ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయినా అధైర్యపడలేదు.

కష్టపడి ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం సంపాదించింది. ఆమెకు వచ్చే కొద్దిపాటి జీతానికి చన్నీళ్లకు వేణ్ణీళ్లలా మామగారి పెన్షన్ కొద్దిగా సహాయపడేది. అతికష్టం మీద కాపురాన్ని గుట్టుగా నెట్టుకొస్తోంది జయ. రోజులు చాలా భారంగా గడిచిపోతున్నట్లు తోచింది జయకు.

మరోవైపు టైపిస్టు షీల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక గొంతు వరకూ అప్పుల్లో ఇరుక్కుపోయాడు శ్రీను. ఆమె కోరే కోర్కెలను తీర్చేందుకు ఎక్కడా అప్పు కూడా ఇచ్చేవారు లేకుండాపోయారు శ్రీనుకి.

అందుకనే టైపిస్టుగారు శ్రీనుకు హ్యాండ్ ఇచ్చి ఆఫీసులో కొత్తగా చేరిన అమర్‌నాధ్ వెంటపడ సాగింది. అదేమని అడిగిన శ్రీనుని... నువ్వెవరు నన్నడిగేందుకు? వెళ్ళు ఇంకెప్పుడూ నా ఇంటి గుమ్మం కూడా తొక్కకు అని శాసించింది.

నాలుగు రోజులు అలా.. ఇలా తిరిగి చేసేది లేక మొదటి భార్య జయ ఇంటివైపు దారితీశాడు. గుమ్మం ముందు అతడిని చూసిన తండ్రి "ఈ దుర్మార్గుడ్ని ఈ ఇంటి గడప తొక్కనీయకూడదు. వెంటనే వెళ్లిపొమ్మని చెప్పు" అని ఆవేశంతో ఊగిపోయాడు.

శ్రీను ముఖం వాడిపోయింది. బేలగా ఇంటి గుమ్మం ముందే నిలబడి చూస్తూ ఉన్నాడు. మామగారికి సర్ది చెప్పి.. అతడిని లోపలికి తీసుకువచ్చింది జయ. ప్రియురాలికోసం పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయిన శ్రీనుని బయటపడేసింది. జయ అతనికి ఓ దేవతలా కనిపించింది.

Share this Story:

Follow Webdunia telugu