Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్ను నాకు అమ్మేశాడు

Advertiesment
నిన్ను నాకు అమ్మేశాడు
WD
"జీవితం ప్రేమమయం" అని ఊహాలోకాల్లో విహరించేదాన్ని. అదే సమయంలో .. నా మనసు దోచుకున్నాడు రవి. అతని కోసం తల్లిదండ్రులను ఎదిరించి అతనితోనే వెళ్ళిపోయి వివాహం చేసుకున్నాను. వివాహం అయిన వెంటనే "మనం ఇక్కడ వుంటే ప్రమాదం. బొంబాయి వెళ్ళిపోయి బ్రతుకు తెరువు చూసుకుందాం" అన్నాడు.శోభనం కోసం బొంబాయిలో పెద్ద హోటల్‌లో రూం బుక్ చేసాడు.

ఆ గది శోభాయమానంగా అందంగా అలంకరించి ఉన్నది. రవి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తలుపు శబ్దమయింది. అటు చూసేసరికి వేరెవ్వరో లోపలికి వస్తున్నారు. అడిగితే ..." నిన్ను నాకు అమ్మేశాడు" అని అన్నాడు.

పూర్తిగా మోసపోయానని తెలుసుకున్నాను. నేనలాంటిదాన్ని కాదని నా కథ పూర్తిగా అతనికి చెప్పుకున్నాను. అదృష్ట వశాత్తు అతను ఏమీ చేయక "చూడమ్మా ఈ రవి పెద్ద బ్రోకర్. నీ లాంటి అమాయకుల్ని మోసంచేసి అమ్మేస్తుంటాడు. ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకోలేదంటే రేపు వ్యభిచార గృహాలకు అమ్మేస్తాడు. " అని ఆమెను అక్కడ నుంచి పంపేశాడు.

ఎలాగో రైల్వే స్టేషనుకు చేరుకున్న రాజీ కదులుతున్న బండిని ఎక్కేసింది. ఆమెను అదేపనిగా చూస్తోంది సరస్వతి అనే మహిళ. "నేను ఎక్కేసరికి రైలు కదులుతూ ఉందండీ. టిక్కేట్ తీసుకునే సమయం కూడా లేదు... అందుకే ఎక్కేశాను" అంటూ తన దీన గాధను ఆమెతోతో చెప్పుకుంది రాజీ.


"నువ్వేం భయపడకమ్మా ఈ రైలు హైదరాబాదు వెళుతుంది. టిటితో చెప్పి టికెట్ రాయిస్తాను. నీ అడ్రసు ఇచ్చావంటే మీ అమ్మానాన్నలను పిలిపిస్తారు. నువ్వు వాళ్ళతో వెళ్ళి పోవచ్చు." అని చెప్పింది. బండి దిగి రాజీని తనతోపాటు తీసుకెళ్లింది.

"చూడమ్మా రాజీ! ఇది నీ ఇల్లే అనుకో మీ తల్లిదండ్రులు వచ్చేవరకూ ఇక్కడే నిశ్చింతగా ఉండవచ్చు." అని ఒక గది కేటాయించింది సరస్వతి.

అర్ధరాత్రి రాజీ నిద్రలో ఉండగా ఎందుకో మెళకువ వచ్చింది. వినకూడదనుకుంటూనే విన్నది. "అది ఫ్రెష్ కేసు. అదృష్టవశాత్తు నాకు దొరికింది. మన ఫైవ్ స్టార్ హోటల్‌కు దీన్ని తరలించు. మిగిలినది కమలేష్ చూసుకుంటాడు" అని ఆమె అంటున్న మాటలు చెవినబడ్డాయి.

ఆ మాటలు విన్న రాజీ కుప్పకూలిపోయి "అయ్యో! ఊబిలో కూరుకుపోయానే, రక్షిస్తావని నిన్ను నమ్మితే నన్ను ఊబిలోకి దించుతావా" అనుకుంటూ క్షణమొక యుగంలా గడపసాగింది. తలుపు తీయగానే వచ్చినవాడిని చితకబాది పారిపోవాలని అనుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఉదయాన్నే సరస్వతి ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చారు. రాజీని చూసిన పోలీసులు ఆమెను ప్రశ్నించారు. జరిగినదంతా చెప్పింది.

"చూడమ్మా! ఈమె పెద్ద బ్రోకర్. అమ్మాయిల్ని సరఫరా చేస్తుంది. వారం రోజుల నుంచి పోన్ ట్యాపింగ్ చేశాము. అదీ అతనికి ఎవరో స్మగ్లర్లతో సంబంధాలున్నాయని అనుమానంతో. నీ అదృష్టం బాగుంది కాబట్టి ఈ సరస్వతి ఫోన్ కాల్ విన్నాము. అందువల్లే ఈ రోజు ఇక్కడకు రాగలిగాం. నిశ్చింతగా నిన్ను నీ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాం" అని సరస్వతిని అరెస్టు చేశారు పోలీసులు. "ఆడదానికి ఆడదే శత్రువు!" అనుకొని నిశ్చలంగా వుండిపోయింది రాజీ.

Share this Story:

Follow Webdunia telugu