Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పు ముదిరింది, అబ్బాయి చదువు ముగిసింది - పెళ్లి కుదిరింది, ఫారిన్ సెటిలైంది

అప్పుడే పుట్టాడు చిన్నారి వెంటనే పరుగెట్టాడు నాన్నారు ఎక్కడికిరా భడవా అన్నారు తాతారు సంటోడికి ఎల్కేజీ సీటు కోసం అంది బామ్మారు బడిలో ఎల్కేజీ దరఖాస్తు క్యూ నింపినదివ్వడానికి మరో క్యూ సంటోడికి నాలుగో ఏటకు సీటు 50 వేలు అడ్వాన్సు బుకింగ్

Advertiesment
poem
, గురువారం, 26 మే 2016 (19:44 IST)
అప్పుడే పుట్టాడు చిన్నారి
వెంటనే పరుగెట్టాడు నాన్నారు
ఎక్కడికిరా భడవా అన్నారు తాతారు
సంటోడికి ఎల్కేజీ సీటు కోసం అంది బామ్మారు
 
బడిలో ఎల్కేజీ దరఖాస్తు క్యూ
నింపినదివ్వడానికి మరో క్యూ
సంటోడికి నాలుగో ఏటకు సీటు
50 వేలు అడ్వాన్సు బుకింగ్
 
కౌంటర్ కింగ్ క్వచ్చన్ మార్క్
పచ్చనోట్లు జమకు రెడీ
సంటోడి సీటు కన్ఫర్మ్
ఇదిగో రశీదు... నాలుగేళ్లూ జాగ్రత్త మేస్టారూ
 
ఇంటికొస్తే సంటోడి చిర్నవ్వు
నాలుగేళ్లూ నవ్వుతూనే ఎల్కేజీకి
1,2,3,4,5,6,7,8,9 క్లాసెస్ ఫినిష్
ఫౌండేషన్ కోర్సు, ఎందుకనడగరే ఐఐటీకి
ఎంతనడగరే, 2 లక్షలు తెచ్చుకో
మీవాడి జాతకం మా కోర్సుతోనే
 
అబ్బో... చాలా చమురు, దొరుకుతుందా
చేర్చేద్దామండీ, శ్రీమతి పిలుపు
నా స్నేహితుడూ అదే నాన్నా
పుత్రరత్నం పలకరింపు
చమురు వదిలింది...
అప్పు మిగిలింది
 
+1, +2 ముగిసింది, 
వాడి తలపై అరజుట్టు అదృశ్యమైంది...
సన్నాఫ్ సత్యమూర్తి స్టయిలుతో
వాడి నాన్నకు నెత్తిపై అర ఎకరా పోయింది... టెన్షనుతో...
 
ఫౌండేషన్ కోర్సు పాలిపోయింది
ఫలితాల్లో సంటోడి పేరు పారిపోయింది
బీటెక్ కోర్సు వాలిపోయింది...
ఎంతేంటి కన్నా, రెండు ఎనిమిదులు పదహారు 'ల'కారాలు
కుదరదు చిన్నా, నాన్న గొణుగుడు
నా జీవితం నాన్నా, పుత్రుడు అరుపు
 
అప్పు ముదిరింది, అబ్బాయి చదువు ముగిసింది
పెళ్లి కుదిరింది, ఫారిన్ సెటిలైంది
అమ్మానాన్నార్లు ఓల్డేజ్ హోముకు
కొత్త పెళ్లి కూతురుతో విమానంలో చిన్నోడు ఫారిన్‌కు...
 
- యిమ్మడిశెట్టి వెంకటేశ్వ రావు(అసిస్టెంట్ ఎడిటర్, వెబ్ దునియా తెలుగు)
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని ఆ ఐదు కూరగాయలు ఏంటి?