Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి బర్త్ డే సందర్భంగా పరాక్రమం సినిమా విడుదల చేస్తున్నాం : బండి సరోజ్ కుమార్

Advertiesment
Bandi Saroj Kumar, Shruti Samanvi and Parakram team

డీవీ

, మంగళవారం, 23 జులై 2024 (17:39 IST)
Bandi Saroj Kumar, Shruti Samanvi and Parakram team
బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పరాక్రమం". శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈరోజు హైదరాబాద్ లో  మూవీ రిలీజ్ అనౌన్స్ మెంట్ టీజర్ విడుదల చేశారు.
 
అనంతరం బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ - మా పరాక్రమం సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేస్తున్నాం. చిరంజీవి ని గారు అని పిలవమని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మన ఇంట్లో అమ్మను అమ్మ అనే పిలుస్తాం అమ్మ గారు అని పిలవం. అలాగే నన్ను ఎంతో ఇన్స్ పైర్ చేసిన చిరంజీవి ని చిరంజీవి అనే పిలుస్తాను. ఆయన నాకు  శివుడిలా భావిస్తా. పరాక్రమం సినిమా విషయానికి వస్తే ఇదొక సంఘర్షణ తో కూడుకున్న కథ. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నారాయణగూడ బాయ్స్ హాస్టల్ లో ఉండేవాడిని. ఆర్టీవో ఆఫీసర్ అబ్బాయి మా పొరుగునే ఉండేవాడు. వాళ్లది రిచ్ ఫ్యామిలీ. 
 
నేను ఒక రోజు రోడ్డు మీద క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటే క్రికెటర్ అవుతావా మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. వెనక చూసి ముందుకు వెళ్లాలి బ్రదర్ అన్నాడు. ఆరోజు ఆయన అన్న మాటలు నాలో కసిని నింపాయి. ఒకరోజు అతను నన్ను తలెత్తుకుని చూడాలి అనుకున్నా. ఆ ఫైర్ తోనే ఈ సినిమాలో నా లోవరాజు క్యారెక్టర్ రాసుకున్నా. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో. బ్రదర్ నీకు థ్యాంక్స్ చెబుతున్నా. నేను గతంలో నిర్భందం , నిర్భందం 2 , మాంగళ్యం సినిమాలను రూపొందించాను. అవి డిజిటల్ గానే మీ ముందుకు వచ్చాయి. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు  మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే పరాక్రమం. నా గత సినిమాలు కొన్ని వర్గాల ఆడియన్స్ మాత్రమే చూశారు. కానీ ఈ పరాక్రమం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నేను చిత్ర పరిశ్రమలో ఎదగాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. వారికి థాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
ఈ కార్యక్రమంలో రిలీజ్ చేసిన పరాక్రమం డేట్ అనౌన్స్ మెంట్ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. సినిమాను థియేటర్ లో చూడాలనే క్యూరియాసిటీ ఈ టీజర్ క్రియేట్ చేస్తోంది. పరాక్రమం రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కార్యక్రమంలో ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.
 
నటీనటులు : బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగువ లోని ఫైర్ సాంగ్ తో ఎమోషనల్ పండించిన హీరో సూర్య