Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓటుకు 5000 లక్ష్మీ కటాక్షం కురిపిస్తున్న సాయి కుమార్

Advertiesment
Laxmi kataksham team

డీవీ

, శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (15:11 IST)
Laxmi kataksham team
ప్రముఖ నటుడు డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన పాతికేళ్ళ పొలిటికల్ కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసం రాబోయే ఎలక్షన్ ను చాలా ప్రశ్టేజ్ గా తీసుకుంటాడు, మరో పక్క పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా ఈ ఎలక్షన్ లో ఒక్క రూపాయి కూడా పంచకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పోలీస్ బందోబస్త్ నుండి, తక్కువ టైంలో 100 కోట్లని, రెండు లక్షల మంది ఓటర్లకు, ఓటుకు 5000 చొప్పున ఎలా పంచుతారు అనే నేపధ్యంలో లక్ష్మీ కటాక్షం సినిమా రూపొందుతోంది. ఈరోజే ట్రైలర్ విడుదల అయ్యింది. సినిమా కథ ఇలా ఉండబోతున్నట్టు ట్రైలర్లో తెలుస్తుంది, కామెడీ తో పాటు హూకింగ్ డ్రామా కూడా ఉంది ఈ ట్రైలర్ లో.
 
ఒక పక్క సాయి కుమార్ కి ఎలక్షన్ ఫండ్ రావడం ఒక ఛాలెంజ్ అయితే, ఇంకో పక్క లాస్ట్ మినిట్ లో వచ్చిన ఫండ్ ఎలా పంచాలి అనేది ఇంకో ఛాలెంజ్, ఈ తరుణంలో చిరాకు పడి అన్ని దారులు మూసుకున్న సాయి కుమార్ లక్ష్మీ దేవిని ఎలక్షన్ ఫండ్ కటాక్షించమని డిమాండ్ చేస్తారు, లక్ష్మి దేవి ప్రత్యేక్షమవుతారు, ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో సాగే ఈ ‘లక్ష్మీ కటాక్షం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సినిమాకి సూర్య రైటర్, డైరెక్టర్ గా వ్యవహరించారు. ట్రైలర్ లో డ్రామా పర్ఫెక్ట్ గా హైలైట్ అయ్యేలా మ్యూజిక్ అభిషేక్ రుఫుస్ అందించారు.
 
మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం’ ఓపెనింగ్ లోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ డేట్ నే సినిమాలో ఎలక్షన్ డేట్ లాగా అనౌన్స్ చేశారు,

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు, రాజమౌళి కలయికతో ఎయిర్ పోర్ట్ లో హల్ చల్