Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Advertiesment
Manoj Kumar, Ashitha Reddy, Srinivas,Ramanamurthy Tangellapalli

దేవీ

, మంగళవారం, 10 జూన్ 2025 (18:03 IST)
Manoj Kumar, Ashitha Reddy, Srinivas,Ramanamurthy Tangellapalli
మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "నిశ్శబ్ద". ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "నిశ్శబ్ద" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు.
 
నటుడు సూర్య మాట్లాడుతూ - "నిశ్శబ్ద" చిత్రంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కి బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఆయన ఈ చిత్రంతో ఎంతోమంది కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. అన్నారు.
 
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ, "నిశ్శబ్ద" టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. సినిమా కూడా అంతే బాగుంటుంది. త్వరలోనే మా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తాం. ఇంకా నాలుగైదు ఇంట్రెస్టింగ్ మూవీస్ మా ప్రొడక్షన్ నుంచి రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ చిత్రాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీలైనంతమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి కంటెంట్ ఉన్న మంచి చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
 
నిర్మాత ఎం. సంధ్యారాణి మాట్లాడుతూ - మా "నిశ్శబ్ద" సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీగా మా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. మా సంస్థ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రాబోతున్నాయి. అన్నారు.
 
డైరెక్టర్ రమణమూర్తి తంగెళ్లపల్లి మాట్లాడుతూ - నేను గతంలో ప్రేమ తరంగాలు అనే ఓ లవ్ స్టోరీ మూవీ రూపొందించాను. ఇప్పుడు "నిశ్శబ్ద" అనే హారర్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాను. ఈ సినిమా చేసే క్రమంలో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఎంతో సపోర్ట్ అందించారు. మొత్తం రాత్రుళ్లు షూటింగ్ చేశాం. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 వరకు షూటింగ్ చేసేవాళ్లం. మా కాస్ట్ అండ్ క్రూ షూటింగ్ కు ఎంతో సపోర్ట్ చేశారు. మీ అందరి ఆదరణతో "నిశ్శబ్ద" సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
 
హీరోలు కృష్ణ, సంజయ్, మనోజ్ కుమార్ మాట్లాడుతూ - "నిశ్శబ్ద" మూవీలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. మా డైరెక్టర్ రమణమూర్తి గారు ఇచ్చిన సజెషన్స్ వల్లే ఈ మూవీలో బాగా నటించగలిగాను. షూటింగ్ టైమ్ లో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. మాది చిన్న సినిమా కాదు. మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా. హారర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఎక్కడా అసభ్యత ఉండదు. క్లీన్ హారర్ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
 
హీరోయిన్ ఆశిత రెడ్డి మాట్లాడుతూ - "నిశ్శబ్ద" చిత్రంతో నేను హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నాకు ఎక్కువగా డైలాగ్స్ ఉండవు. పర్ ఫార్మెన్స్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశా. నాతో పాటు నటించిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా సపోర్ట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రమణమూర్తి గారికి, ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్, సంధ్యారాణి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు. ఇంకా నటి నాగలక్ష్మి తదితరులు మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్