Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళింగ యుద్ధం తరువాత వెల్లడైన దైవ రహస్యం నేపథ్యంలో మిరాయ్ గ్లింప్స్ రిలీజ్

Teja Sazza

డీవీ

, గురువారం, 18 ఏప్రియల్ 2024 (17:20 IST)
Teja Sazza
టాలీవుడ్ లో విజయవంతమైన ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ప్రొడక్షన్ నెం. 36ని ప్రకటించింది, ఇందులో సూపర్ హీరో తేజ సజ్జ సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం లో అభిరుచి ఉన్న నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఒక గ్లింప్స్ గురువారంనాడు రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు  విడుదల చేశారు.
 
ఈ చిత్రానికి ఫ్యూచర్ అనే అర్థం వచ్చేలా “మిరాయ్” అనే టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో జపనీస్ ఫాంట్ లో రూపొందించబడింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్ లో చేతిలో యో (స్టాఫ్ స్టిక్)తో, బద్దలయ్యే అగ్నిపర్వతం పైన ఉగ్రంగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో, మనం గ్రహణాన్ని గమనించవచ్చు.
 
ఈ గ్లింప్స్ సినిమా నేపథ్యాన్ని తెలిపేలా ఉంది. ఇది అశోక రాజు మరియు అతని 9 రహస్యాల  ఆధారంగా రూపొందించబడింది. కళింగ యుద్ధం అశోకుని చరిత్రలో చెడ్డ గుర్తుగా మిగిలిపోయింది. ఆ పశ్చాత్తాపంలోనే దైవ రహస్యం వెల్లడైంది. అంటే మనిషిని దైవంగా మార్చే 9 గ్రంథాల అపారమైన జ్ఞానం. తరతరాలుగా వారిని రక్షించేందుకు 9 మంది యోధులను నియమించారు. అటువంటి జ్ఞానానికి గ్రహణం చేరుకుంటుంది. అప్పుడు గ్రహణాన్ని ఆపడానికి ఒక జన్మ పుడుతుంది. తరతరాలుగా ఇది అనివార్యమైన మహా యుద్ధం అంటూ బుద్ధ సన్యాసి నుండి వచ్చిన కథనం మనల్ని కట్టిపడేస్తుంది. ఇంతకు ముందు చూడని విజువల్ వండర్ లా ఈ చిత్రం ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది
 
 ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పై కార్తీక్ ఘట్టంనేనికి ఉన్న గ్రిప్ ఏంటో గ్లింప్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. కథకు హిస్టారిక్ టచ్ ఉన్నప్పటికీ, అది ఎంగేజింగ్ గా చెప్పారు. అశోకుడి 9వ రహస్యానికి గ్రహణం రాకుండా ఆపడానికి వచ్చిన సూపర్ యోధగా తేజ సజ్జ ఎంట్రీ అద్భుతంగా ఉంది.తను కర్రసాము మరియు ఇతర పోరాటాలలో రాణించాడు. సూపర్ యోధాగా  సరిగ్గా నప్పుతూ అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు వచ్చాడు. కథానాయికగా నటించిన రితికా నాయక్ కు మంచి పాత్ర లభించినట్టు తెలుస్తుంది
 
కార్తీక్ ఘట్టంనేని సినిమాటోగ్రఫీలో తన నైపుణ్యాన్ని చూపించి ప్రతి ఫ్రేమ్ డైమండ్ లా చూపించాడు. గౌర హరి తన అద్భుతమైన స్కోర్ తో కథనాన్ని మరింత ఇంటరెస్టింగ్ గా తీసుకువెళ్లాడు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ప్రపంచ స్థాయికి తక్కువ కాకుండా ఉన్నాయి, ఒక అంతర్జాతీయ సినిమా చూస్తున్న అనుభూతిని పొందుతాము. మిరాయ్ గ్లింప్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది మరియు తదుపరి అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.
 
కార్తీక్ ఘట్టంనేని స్క్రీన్ ప్లే రాయగా మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల కాగా, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
గ్లింప్స్ ద్వారా నిర్మాతలు మిరాయ్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషల్లో ఏప్రిల్ 18న వేసవిలో 2D మరియు 3D వెర్షన్ లలో సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడిని గట్టిగా హగ్ చేసుకుని హాయిగా నిద్రపోతాను: బిగ్ బాస్ అశ్విని