Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లెవన్ లో కూడా అలాంటి సర్ ప్రైజ్ ఇంటెన్స్ వుంది : నవీన్ చంద్ర

Naveen Chandra,   Reya Hari, Sha shank, Ravi Verma and others

డీవీ

, బుధవారం, 19 జూన్ 2024 (18:43 IST)
Naveen Chandra, Reya Hari, Sha shank, Ravi Verma and others
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'లెవెన్'. ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు.
 
ఈ సినిమా టీజర్ ని హీరో నిఖిల్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. ''లెవెన్' టీజర్ చాలా ఎంగెజింగ్ అండ్ స్టన్నింగ్ గా వుంది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్" చెప్పారు నిఖిల్.
 
'రంజిత్ లాంటి ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని ఎందుకు క్రాక్ చేయలేకపోయాడో ఇప్పుడు అర్ధమౌతోంది' అంటూ నవీన్ చంద్ర వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్   అవుట్ అండ్ అవుట్ ఎంగెజింగ్ గా వుంది. లోకేశ్ అజ్ల్స్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని చాలా యూనిక్ అండ్ గ్రిప్పింగ్ గా ప్రజెంట్ చేశారు. నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. మ్యూజిక్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.
 
టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. లెవెన్ కథ విన్న వెంటనే చాలా బావుందనిపించింది. ఈ సినిమాని తమిళ్, తెలుగు ఒరిజినల్ గా, ఒక షాట్ ని రెండు సార్లు షూట్ చేయడం జరిగింది. ఎనిమిది నెలలు ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది. స్క్రిప్ట్ కోసం ఇంత పాషన్ గా పని చేసిన నిర్మాతలని నేను ఇప్పటిదాక చూడలేదు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఈ సినిమాతో తెలుగులోకి వస్తున్నారు. ఖచ్చితంగా మంచి విజయం అందుకుంటారు. చాలా ఇంటెన్స్ గా క్లియర్ గా తీర్చిదిద్దిన ఈ సినిమా ఇది. బ్యూటీఫుల్ ఫిలిం. ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుంది. రీసెంట్ గా మహారాజ సినిమా చూసి రెండు రోజులు నిద్రపట్టలేదు. అంత ఇంటెన్స్ గా వుంది. ట్విస్ట్ టర్న్స్ స్క్రీన్ ప్లే గురించి ప్రతిఒక్కరూ చాలా బాగా చెప్పారు. అలాగే లెవన్ లో కూడా లాంటి సర్ ప్రైజ్ ఇంటెన్స్ వుంటుంది. కథ, స్క్రీన్ ప్లే,  యాక్షన్, యాక్టింగ్, అన్నీ అద్భుతంగా వుంటాయి. ఈ సినిమా చాలా బావుంటుంది. నా కెరీర్ లో బెస్ట్ థ్రిల్లర్ అవుతుంది. తప్పకుండా సినిమా థియేటర్స్ లో చూడండి' అని కోరారు
 
డైరెక్టర్ లోకేశ్ అజ్ల్స్ మాట్లాడుతూ.. ఈ కథ చెప్పినప్పటి నుంచి నిర్మాతలు చాలా బలంగా సపోర్ట్ చేశారు. నవీన్ గారు ది బెస్ట్ ఇచ్చారు. ఇందులో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటుంది.  మా టెక్నికల్ టీం అంతా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు.  'లెవెన్' ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో ఒక యూనిక్ పాయింట్ వుంది. అది మిమల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. టీజర్ లో చూసిన ఎక్సయిట్మెంట్ సినిమాలో వుంటుంది. ఈ టీజర్ ని లాంచ్ చేసిన నిఖిల్ గారికి థాంక్స్' చెప్పారు.
 
నిర్మాత రేయా హరి మాట్లాడుతూ.. ఇది తెలుగులో నా మొదటి సినిమా. నవీన్ గారు చాలా అద్భుతమైన యాక్టర్. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. అందరికీ థాంక్స్' చెప్పారు.
 
నిర్మాత అక్బర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది మా మూడో సినిమా. తొలి రెండు సినిమాలు బాక్సాఫీసు హిట్స్ అయ్యాయి. లెవన్ సినిమాని తెలుగు, తమిళ్ లో స్ట్రయిట్ సినిమాలా తీశాం. నవీన్ గారు అద్భుతంగా పెర్ఫార్మామ్ చేశారు. ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అవుట్ అండ్ అవుట్ యంగేజింగ్ గా వుంటుంది. అందరికీ నచ్చుతుంది' అన్నారు
 
యాక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. నవీన్ వలనే ఈ సినిమా చేశాను. నన్ను గుర్తుపెట్టుకొని పిలిచి ఈ పాత్ర గురించి చెప్పారు. యాక్టర్ గా మంచి ఎక్స్ పీరియన్స్. లోకేష్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. నిర్మాతలు చాలా పాషన్ తో సినిమా చేశారు. ఇందులో చాలా కీలక పాత్ర చేశాను. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు. మూవీ యూనిట్ సభ్యులంతా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
 
‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్.
 
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలో థియేటర్లలోకి విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.
 
నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, ఆడుకలం నరేన్, రవివర్మ, అర్జై, కిరీటి దామరాజు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సస్పెన్స్, యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్, భక్తితో శివం భజే టీజర్