Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Advertiesment
Kesari 2 poster

దేవీ

, శనివారం, 17 మే 2025 (20:25 IST)
Kesari 2 poster
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే నటించిన ప్రధాన పాత్రలు, ఎమోషన్స్ తో నిండిన కోర్ట్ సన్నివేశాల్లో వారి నటనకు విశేష ప్రశంసలు లభించాయి.
 
ఇప్పుడు ఈ చిత్రం తెలుగులోకి డబ్ చేయబడి మే 23న విడుదల కాబోతుంది. ఇప్పటికే హిందీ వర్షన్‌కు విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు రావడంతో, తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది.
 
తాజాగా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ తరువాత జరిగిన సంఘటనలు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి, అక్షయ కుమార్ పాత్ర చేసిన న్యాయపోరాటాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన ఈ ట్రైలర్ అదిరిపోయింది.  
 
అక్షయ్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. తన కెరీర్‌లోని అత్యుత్తమ నటన ప్రదర్శించారు. ఆర్. మాధవన్, అనన్య పాండే పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. దర్శకుడు సమగ్ర పరిశోధనతో పాటు భావోద్వేగంతో నిండిన కోర్ట్ సన్నివేశాలకు రియలిస్టిక్‌గా, ఆకట్టుకునేలా చూపించాడు. డబ్బింగ్ క్యాలిటీ అద్భుతంగా వుంది. తెలుగు ట్రైలర్ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
 
ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం వల్ల, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘కేసరి ఛాప్టర్ 2’ తో ప్రేక్షకులకు పవర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్