ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్, ప్రాచి, జ్యోతి నటీనటులు గా యోగి కుమార్ దర్శకత్వంలో శ్రీకాంత్ కీర్తి నిర్మిస్తున్న చిత్రం `లవ్ యు టూ. ట్రైలర్ ను వి.వి. వినాయక్ తన బర్త్ డే సందర్భంగా వైజాగ్ లో విడుదల చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ కు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నువ్వు తోపురా డైరెక్టర్ హరినాథ్ తో పాటు తదితర సినిపెద్దలు ముఖ్య అతిథిదులుగా పాల్గొని చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపారు.
హీరో ఆట సందీప్ మాట్లాడుతూ, నా భార్య జ్యోతి నేను చేసే సీన్స్ లలో ఇలా కాదు అలా చేయమని నాకు సపోర్ట్ గా నిలిచి చెప్పడం జరిగింది. తనని నేను కో యాక్టర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. తను మై లవ్ అని చెప్పగలను నా లైఫ్ లో వైఫ్ అని చెప్పగలను. అందరూ ఇది నీ సబ్జెక్టు కదా అని చాలా మంది అడుగుతున్నారు. ఇది నా సబ్జెక్ట్ కాదు దర్శకుడు ఇప్పుడు జరుగుతున్న కథలను బేస్ చేసుకొని తీసిన కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అలాగే కరోనా టైంలో నేను మా ఫాదర్ ని కోల్పోవడం జరిగింది.దీన్ని నేను లైఫ్ లో జీర్ణించుకోలేక పోతున్నాను.మా ఫాదర్ షూటింగు చూస్తుండగానే చనిపోవడం జరిగింది. తను చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇది నాకు తీరని లోటు. కరోనా కాలంలో ఎంతో మంది ఎంతోమందిని కోల్పోయారు వారిలో నేను ఒకరిని. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం మా ఫాదర్ కోల్పోవడం పోయినందుకు నాకు చాలా బాధ గా ఉంది. నా వైఫ్ కూడా నాకు సపోర్ట్ గా నిలిచి నాకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని కన్నీటి పర్యంతం అయ్యారు.
నటి జ్యోతి మాట్లాడుతూ, ఈ సినిమా రియలిస్టిక్ గా ఉండాలని దర్శకుడు రియల్ లైఫ్ వైఫ్ & హస్బెండ్ అయిన మమ్మల్ని ఈ వినిమాలో పెట్టుకున్నారు.ఈ మూవీ లో ప్రాచీతోసందీప్ చెప్పే డైలాగ్స్ నాకు డిఫికల్ట్ గా ఆనిపించేది తన వైఫ్ గా నా హాట్ వీక్ గా అనిపించేది. కానీ యాక్టింగ్ అయినా మూవీ అయినా మమ్మల్ని చూసి ఇన్స్పయిర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు .మమ్మల్ని చూసి చాలా మంది బెస్ట్ కపుల్ అనేవారు. అలా ఉన్న మేము ఇలాంటి సినిమాతో మేము మెసేజ్ ఇస్తూ పోస్టర్ ను రిలీజ్ చేస్తే చాలామంది మా పోస్టర్ ను చూసి ఇలాంటి సినిమా మీరు చేయకూడదని చెప్పారు. అయినా ప్రేక్షకులకు మేము ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఇవ్వాలని చేస్తున్నాము.ఇంత మంచి సినిమాతో మెసేజ్ ఇస్తున్న మా సినిమాను దర్శకుడు లవ్ యు టూ ,పార్ట్ 2 ,పార్ట్ 3 లు తీస్తూ చాలా చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు హరినాథ్ మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీసి మనకు మనమే ప్రూవ్ చేసుకోవాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలబడి గలుగుతాము. తీసిన ప్రతి సినిమా హిట్టయితే చేసిన ప్రతి ఒక్కరూ స్టార్స్ అయ్యే వారు . సినిమా తీయడం అంటే పెద్ద స్ట్రగుల్ తో కూడుకున్న పని అలా సక్సెస్ అందుకున్న కొందరే స్టార్ట్ అవుతారు. రామాచారి గారి అబ్బాయి సాకేత్ అందించిన మ్యూజిక్ చాలా ఎక్స్ట్రార్దినరీ గా ఉంది.శ్యాం విజువల్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.ఆట ద్వారా కొరియోగ్రాఫర్ గా సందీప్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ చిత్రంతో హీరోగా అడుగు పెడుతున్నాడు.మంచి నటుడ్ని సెలెక్ట్ చేసుకుని మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొన్నాడు దర్శకుడు యోగి.ఇప్పుడు జనాలకు ఏ సినిమా కావాలని కోరుకుంటున్నారో అటువంటి మంచి కంటెంట్ ఈ సినిమాలో ఉంది.ట్రైలర్ లోనే తెలుస్తుంది ఇది మంచి సినిమా అని ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ నీకు నువ్వే తోపు అనిపించుకోవాలి అన్నారు.
కార్యనిర్వాహక ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆట సందీప్ గారు నా స్కూల్ మేట్ తను ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు ఇందులో చాలా ఎనర్జిటిక్ గా నటించాడు ప్రాచి,జ్యోతి లు చాలా చక్కగా నటించారు.మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సినిమాకు ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని చాలా హార్డ్ వర్క్ చేశారు డి.ఓ.పి. శ్యామ్ , ఆర్ట్ డైరెక్టర్ వేణు ఇలా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారు. ప్యాండమిక్ స్విచ్వేషన్ లో మేము చాలా స్త్రగుల్స్ ఫేస్ చేశాము. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. మా టీం అందరూ కూడా మంచి మూవీ తీసి ఈ సినిమాను సక్సెస్ చేయాలనేది మా తాపత్రయం అన్నారు.
చిత్ర దర్శకుడు యోగి మాట్లాడుతూ, లవ్ అనేది ఎప్పుడైనా మనిషి ఏ స్టేజ్ లో ఉన్న ఏ ఏజ్ లో ఉన్న మ్యారిటల్ స్టేటస్ ఏమైనా ఒకవేళ ఆ ఇద్దరి మధ్యన అది ప్రేమే అని అనుకుంటే అది ప్రేమే ..నో మేటర్ అది పెళ్లి అయినా వేరే మనిషితో లవ్ అని ఉన్నా.. అనుకున్నా ఆ ఫీలింగ్ కలిగినా ఒకటేలా ఉంటుంది ఇట్ ఈజ్ నో డీఫ్రెన్సు అనే జస్టిఫికేషన్స్ తో వచ్చే సినిమా. ఈ సినిమా పై ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా క్లారిఫై చేశాం ట్రైలర్ చూస్తే అందులో కొశ్చన్స్ ఉంటాయి సినిమా లో కొశ్చన్స్ కి ఆన్సర్ ఉంటుంది. పెళ్ళైన వ్యక్తి ప్రేమించ కూడదా అని అడగట్లేదు పెళ్ళైన వాడికి కూడా ఇంకొకరి పైన ఇష్టం ఉంటే ప్రేమించ లేడా అని అడుగుతున్నాం. దట్ కుడ్ బి లవ్ అని జస్టిఫై చేయడమే నా కాన్సెప్ట్ ఇందులో ఐదు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ సినిమా లాస్ట్ లో వైఫ్ ఇచ్చిన మెసేజ్ చూడండి.ఈ మూవీ ఎమోషనల్ డ్రామా..ఇందులో చాలా జస్టిఫికేషన్స్ ఉంటాయి. నా మొదటి చిత్రం తో ఇలాంటి కథతో అవకాశం రావడం చాలెంజింగ్ గా అనిపించింది.
ఈ సినిమామొదలు పెట్టక ముందు నుంచి కూడా ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్స్ డైలాగ్స్ అన్నీ కూడా సందీప్ తెలుసు కాబట్టి ఇందులో సందీప్ చాలా మెచ్యూర్డ్ గా డెలివరీ చేశారు.రొమాంటిక్ సీన్స్ లో కూడా కావలసిన దానికంటే ఎక్కువగా చేశారు . నేను కొత్త డైరెక్టర్ అయినా కూడా నాకు వ్యాల్యూ ఇచ్చి నేను చెప్పిందే కరెక్ట్ అని నమ్మి సినిమా చేయడం జరిగింది. సందీప్ తో నా జర్నీ షార్ట్ ఫిలిం తో స్టార్ట్ అయి ఈరోజు సినిమా వరకు వచ్చింది .ఇలాంటి నటుడితో ఫీచర్లో ఇంకా ఎన్నో ప్రాజెక్టు చేయాలను కుంటున్నాను అన్నారు.
నటి ప్రాచీ మాట్లాడుతూ* .. దర్శకుడు కి తన విజన్ ఏంటో ఇందులో చాలా చక్కగా చూపించాడు. ఇలాంటి మంచి మూవీ లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాత లకు ధన్యవాదాలు.