Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

Advertiesment
Akhanda 2 – Balayya look
Akhanda 2 – Balayya look
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ ‘అఖండ 2 – తాండవం’ నుంచి కొద్దిసేపటి క్రితమే బాలక్రిష్ణ ఎమోషనల్ స్టిల్ విడుదలచేసింది చిత్ర టీమ్. దానితోపాటు టీజర్ ను విడుదల చేశారు. హిమాలయాల్లో బాలక్రిష్ణ చేసిన యాక్షన్ శివతాండం మామూలుగా లేదు. ఈసారి మరింత రెచ్చిపోయినట్లుగా వుంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను మరోసారి తనదైన రీతిలో తెరకెక్కించారు.
 
webdunia
Akhanda 2 – Balayya look
ఈ టీజర్‌లో అఘోరా పాత్రలో బాలయ్య మరోసారి తన ఊచకోతను కంటిన్యూ చేస్తూ కనిపించాడు. ‘‘శివుడి అనుమతి లేనిదే యముడు ప్రాణాలు తీయడని.. అలాంటిది నువ్వు అమాయకులను చంపేస్తావా..’’ అంటూ విలన్ గ్యాంగ్‌ను బాలయ్య ఏకిపారేస్తున్న సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అఖండలో చూపించినట్లుగా శూలంతో పదిమంది విలన్ల గ్యాంగ్ ను ఊచకోత సరికొత్తగా అనిపించింది. శూలం మెడలో తిప్పుతూ అందరికీ నరికిపారేయడం ఈ టీజర్ ప్రత్యేకత. థమన్ అందించిన బీజీఎంతో దబిడి దబిడి చేశాడనే చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !