Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లరి నరేష్ సినిమా ట్రైలర్ ను మారేడుమిల్లిలోనే విడుదల చేసారు

Allari Naresh, Vennela Kishore
, శనివారం, 12 నవంబరు 2022 (19:01 IST)
Allari Naresh, Vennela Kishore
హీరో అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈ నెల 25న థియేటర్లలో  విడుదలౌతోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో విడుదల చేసింది చిత్ర యూనిట్. రెండు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. యూనిక్ కంటెంట్ తో పాటు మారేడుమిల్లి యాక్షన్ ఎపిసోడ్స్ విజువల్ ట్రీట్ గా వున్నాయి.  
 
ఈ చిత్రంలో అల్లరి నరేష్  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నారు. ''ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్ మీ ఊర్లో జరగబోతున్నాయి'' అని ఎన్నికల అధికారిగా నరేష్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైయింది. తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం, అక్కడి పాత్రలు ఒకొక్కటిగా పరిచయడం ఆసక్తికరంగా వుంది.
 
 ''సాయం చేయమని మీరు ఎన్ని సార్లు అడిగినా పట్టించుకొని ప్రతి ఆఫీసర్ సమాధానం చెప్పాలి''
''కొండ మీద జనాల ఓట్లు తీసుకోవాలని తెలిసిన ప్రభుత్వ అధికారులకి ఆ జనం బతుకు కోసం ఎంత కష్టపడుతున్నారో ఎందుకు తెలియడం లేదు''
''అన్యాయంగా బెదిరించే వాడికన్నా న్యాయం కోసం ఎదిరించే వాడే బలమైనవాడు''.. ట్రైలర్ తొలి సగంలో వినిపించిన ఈ డైలాగులు ఆలోచన రేకెత్తించేవిగా వున్నాయి.
''పోలీసులు పంపిన, మిలటరీని పంపిన తలదించేదే లేదు'' అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ తర్వాత వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ లు మైండ్ బ్లోయింగా వున్నాయి. నదీ ప్రభావంలో జరిగే యాక్షన్ ఎపిసోడ్, అడవిలో ఎద్దులతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అమేజింగా వున్నాయి.
 
 ఎన్నికల అధికారి పాత్రలో అల్లరి నరేష్ అవుట్ స్టాడింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నరేష్  స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వుంది. ఇంటెన్స్ రోల్ లో సరికొత్తగా ఆకట్టుకున్నారు. ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘు బాబు ట్రైలర్ లో కీలకంగా కనిపించారు.
దర్శకుడు ఎఆర్ మోహన్ యూనిక్ కంటెంట్ తో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు. టేకింగ్ అద్భుతంగా వుంది. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వుంది. రాంరెడ్డి సినిమాటోగ్రఫీ  విజువల్ ట్రీట్ లా వుంది. అడవి అందాలని, అక్కడి జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అబ్బూరి రవి మాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు అత్యున్నతంగా నిలిచాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది.  
 
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ విడుదల చేసిన మసూద ట్రైలర్