Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా.. ఇక మ్యారీడ్ లైఫే... అయ్యయ్యయ్యయ్యో...

Advertiesment
కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా.. ఇక మ్యారీడ్ లైఫే... అయ్యయ్యయ్యయ్యో...
, సోమవారం, 19 అక్టోబరు 2020 (12:58 IST)
అక్కినేని వంశానికి చెందిన మూడోతరం హీరో అఖిల్ అక్కినేని. అఖిల్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ హీరోకు సినీ కెరీర్‌లో ఇప్పటివరకు సరైన హిట్ చిత్రం లేదు. ఈ నేపథ్యంలో అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్". బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. 
 
ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తోన్న ఈ చిత్రాన్ని 2021 జ‌న‌వ‌రిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్-2 బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు వాసు వ‌ర్మ కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గోపిసుంద‌ర్ సంగీత స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. 
 
ఇప్ప‌టివ‌ర‌కు సరైన హిట్టు ప‌డ‌ని అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. న‌టుడిగా త‌న‌కు మంచి స‌క్సెస్ తోపాటు పేరును తెచ్చిపెడుతుంద‌ని ఆశాభావంతో ఉన్నాడు. 
 
తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' చిత్రం నుండి ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ టీజ‌ర్ ద్వారా అఖిల్.. హ‌ర్ష అనే పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఒక అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరియ‌ర్, 50 శాతం మ్యారీడ్ లైఫ్ అంటుంది.
 
కెరీర్‌ని సూప‌ర్‌గా సెట్ చేశా, మ్యారీడ్ లైఫ్‌నే సెట్ చేయ‌లేక‌బోతున్నాను అన్న‌ట్టు చెప్పుకొచ్చారు. పూర్తి టీజ‌ర్‌ని అక్టోబ‌ర్ 25న 11.40నిల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా విడుద‌లైన ప్రీ టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదు వరద బాధితులకు భారీ విరాళాలు ప్రకటించిన నందమూరి బాలకృష్ణ