Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Adirindhi : 'అదిరింది' ట్రైలర్ అదిరిపోయింది...

తమిళ హీరో విజయ్ నటించి విడుదలైన బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న చిత్రం మెర్శల్. ఈ చిత్రం అదిరింది పేరుతో తెలుగులో శుక్రవారం రిలీజ్ కానుంది. ఇందులోభాగంగా, గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల

Advertiesment
#Adirindhi : 'అదిరింది' ట్రైలర్ అదిరిపోయింది...
, గురువారం, 26 అక్టోబరు 2017 (15:10 IST)
తమిళ హీరో విజయ్ నటించి విడుదలైన బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న చిత్రం మెర్శల్. ఈ చిత్రం అదిరింది పేరుతో తెలుగులో శుక్రవారం రిలీజ్ కానుంది. ఇందులోభాగంగా, గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తమిళంలో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, డైలాగులు వివాదాస్పదమైన విషయం తెల్సిందే.
 
ఈ పరిస్థితుల్లో శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ ట్రైలర్‌లో ప్రముఖ హాస్యనటి కోవై సరళ.. ‘కళ్లు లేకుండా బతకచ్చు. కానీ పిల్ల లేకుండా ఎవ్వరూ బతకలేరు’ అని చెప్తున్న డైలాగ్‌, ‘తల్లి బిడ్డను కనడానికి పది నెలలు పట్టుద్ది. ఒకరు డిగ్రీ అందుకోవడానికిమూడేళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమేపట్టుద్ది’ అని విజయ్‌ చెప్తున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
 
అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్‌ త్రిపాత్రాభినయంలో నటించారు. విజయ్‌కి జోడీగా కాజల్‌ అగర్వాల్‌, సమంత, నిత్యా మేనన్‌లు నటించారు. సెన్సార్‌ కారణాల వల్ల ఈ సినిమా తెలుగులో విడుదలవడానికి ఆలస్యమైన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆటంకులన్నీ తొలగిపోవడంతో సినిమాను 27నవిడుదల చేయనున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీ "2.O" ఫస్ట్ లుక్.. ఆడియో వేడుకకు రావాలని ఆ హీరోను అభ్యర్థిస్తున్న శంకర్