Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

‘గల్లీ రౌడీ` టీజర్ ఆసక్తికరంగా వుందంటున్న రౌడీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ (video)‌

Advertiesment
sandeep kishan
, సోమవారం, 19 ఏప్రియల్ 2021 (20:30 IST)
gulkly roudy team
‘బాబు రావాలి.. రౌడీ కావాలి’ అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారా? 
రెండు కోట్ల రూపాయ‌ల డ‌బ్బు కోసం ఓ ఫ్యామిలీ కిడ్నాప్ చేయాల‌నుకుంటుంది. అందుకోసం ఆ ఫ్యామిలీ విశాఖ‌ప‌ట్నంలోని ఓ కుర్ర రౌడీ క‌లిస్తే ..ఏమ‌వుతుంది?
ఎవ‌రన్నా వాడి మ‌న‌వ‌డ్నిఇంజ‌నీర్‌ని చేస్తాడు, డాక్ట‌ర్ చేస్తాడు. బాగా బ‌లిసికొట్టుకుంటే ఎమ్మెల్యేని చేస్తాడు.. కానీ ఓ తాత త‌న మ‌న‌వ‌డిని రౌడీని చేయ‌మేంటి?
 
ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాలంటే ‘గల్లీ రౌడీ’ సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర్ రెడ్డి, చిత్ర స‌మ‌ర్ప‌కుడు, రైట‌ర్ కోన వెంక‌ట్, నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో, పాత్ర‌ల్లో న‌టిస్తున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహా శెట్టి హీరోయిన్. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘గల్లీ రౌడీ’. చిత్రీకరణను పూర్తి చేసుకున్నఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సోమవారం ‘గల్లీ రౌడీ’ టీజర్‌ను రౌడీ హీరో ‘విజయ్ దేవరకొండ’ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 
 
టీజర్ చాలా ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. అసలు ‘గల్లీ రౌడీ’ కథాంశం ఏంటి, ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఈ టీజర్‌లో రివీల్ చేశారు.రైట‌ర్ కోనవెంక‌ట్ క‌థ‌ను ఫ‌న్ రైడ‌ర్‌గా క‌థ‌ను మ‌లిచిన విధాం,  సందీప్ కిషన్ తనదైన డిఫరెంట్ రోల్‌లో నటించారని టీజర్‌ను చూస్తే అర్థమవుతుంది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించే డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి, మరోసారి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు.  కామెడీ కింగ్, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ రోల్‌తో ప్రేక్షకులకు నవ్వులను పంచబోతున్నారు. బాబీ సింహ కీల‌క పాత్ర‌లో న‌టించారు. 
 
న‌టీన‌టులు:  సందీప్ కిష‌న్‌, నేహా శెట్టి, బాబీ సింహ, వైవా హ‌ర్ష‌, వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు
బ్యానర్:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
స‌మ‌ర్ప‌ణ‌:  కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం:  జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాత‌:  ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
సంగీతం:  చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టైలిష్ట్‌:  నీర‌జ కోన‌

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌రోనా ఎఫెక్ట్ `ఆచార్య' షూటింగ్ బ్రేక్!