Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

Rakesh Varre, virinchi varma

డీవీ

, గురువారం, 7 నవంబరు 2024 (18:52 IST)
Rakesh Varre, virinchi varma
నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు..
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: వి. ఎస్. జ్ఞాన శేఖర్, సంగీతం: గోపి సుందర్, ఎడిటర్: రామకృష్ణ అర్రం, సహ నిర్మాత: ఉమ రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు, నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి, దర్శకత్వం: విరించి వర్మ
 
జితేందర్  రెడ్డి పేరుతో సినిమా వస్తుందని ప్రకటించగానే తొలుత ఈయనో ఫ్యాక్షనిస్టో అనుకున్నారు. దర్శకుడు విరించి వర్మ పేరు తెలియగానే సరికొత్త పంథాలో వుంటుందనిపించింది. ఇక బాహుబలితోపాటు పలు సినిమాలలో తన నటనతో మెప్పించిన రాకేష్ వర్రే కథానాయకుడుగా పోస్టర్ విడుదలకావడంతో విద్యార్థి నాయకుడు బయోపిక్ గా రాబోతుందని తెలియగానే కొంత క్రేజ్ ఏర్పడింది. అయితే కొద్దికాలంగా విడుదలకు విధి దోబూచులాడడంతో ఎట్టకేలకు ఈ శుక్రవారమే సినిమా విడుదలవుతుంది. నేడు ఈ సినిమా ప్రత్యేకంగా ప్రముఖులకు ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా వుందో చూద్దాం. 
 
కథ:
అది 1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జితేందర్ రెడ్డి కుటుంబం దేశం కోసం పరితపించే వారు. ఆ క్రమంలో చిన్నతనంలోనే జితేందర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలకు ఆకర్షితుడై ఆర్.ఎస్.ఎస్. డ్రిల్ క్లాస్ లకు కూడా హాజరవుతాడు. ధర్మాన్ని రక్షించాలనే భావాలతో కాలేజీ చదువుతుండగానే విద్యార్థి యూనియన్ ఎ.బి.వి.పి. నాయకుడుగా ఎదుగుతాడు. ఆ తరుణంలో నగ్జలైట్ల ప్రాబల్యం వుండేది. విద్యార్థి నాయకులను ఆకర్షిస్తూ తమ కేడర్ గా తీసుకునే రోజులవి. వారు చేసే పనులవల్ల అమాయకులు చనిపోవడం చూసి జితేందర్ రెడ్డి చలించి పోతాడు. ఆ టైంలోనే దివంగత ఎన్.టి.ఆర్. పాలనలోకి వస్తాడు. అనంతరం జరిగిన కొన్ని సంఘటనతో జితేందర్ రెడ్డి ఎలాంటి పోరు సలిపాడనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
విద్యార్థి నాయకుడు కథలంటే తెగింపుతో కూడినవే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విద్యార్థి నాయకుడు పుట్టుకువచ్చేవారు. కానీ ఈ జితేందర్ రెడ్డి కుటుంబమే దేశం కోసం పరితపించేవారు కనుక ఆ భావాలు మెండుగా వుండేవి. పెండ్లికూడా చేసుకోకుండా అటు ప్రజలకు జరిగే అన్యాయాలపై నగ్జలైట్లపై జరిపే పోరాటమే ఈ చిత్ర కథ. ఈ సినిమాను నిర్మించింది కూడా జితేందర్ రెడ్డి సోదరు కావడం విశేషం. 80 లో జరిగిన కథ కనుక అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే జీవించాడు. ఆహార్యం, లుక్స్, డైలాగ్స్ పరంగా మంచి నటుడిగా సంపాదించుకున్నాడు. 
 
అయితే ఇంతకుముందు కూడా నగ్జలైట్ల సమస్యలపై పలు సినిమాలు వచ్చాయి. కానీ విద్యార్థులతో లింక్ చేస్తూ చేసిన ఒరిజినల్ కంటెంట్ కావడం విశేసంగా అనిపిస్తుంది. మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి సినిమాల్లో ఈ తరహా పోరాటాలు వుండేవి. ఇక ఈ యేడాది విడులైన అదా శర్మ ‘బస్తర్’ సినిమా కూడా ఛత్తీస్ గడ్’ సినిమాలో నక్సలైట్స్ చేస్తున్న అరాచకాలను చూపించారు.
 
ఇలాంటి కథలు ఎంచుకోవడమే కష్టం. దాన్ని సరైనవిధంగా తెరకెక్కించడంలో దర్శకుడికి కత్తిమీద సామే. దాన్ని సమర్థవంతంగా విరించి వర్మ చేశాడనేచెప్పాలి. నగ్జలిజంలో ఒక కోణమే బయట జనాలకు తెలుసు. వారి లోపల మరో కోణం వుంటుందనే ప్రయత్నం కొందరు చేశారు. దాన్ని మరింతగా జితేందర్ రెడ్డి సినిమా  చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వం చేపట్టే ప్రగతికి అడ్డుగా నిలుస్తున్నారు. ఆ విషయాన్ని దర్శకుడు విరించి వర్మ.. తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. ఛత్రపతి శేఖర్ తో పాటు మిగిలిన నటులు బాగానే చేశారు. కథ జరిగిన ప్రాంతంలో తీయడంలో మరింత ఆకట్టుకుంది.
 
కథనాన్ని నడిపే తీరు ఆకట్టుకుందనే చెప్పాలి. గతంలో జార్జిరెడ్డి వంటి సినిమాలు వచ్చినా విద్యార్థి నాయకుల మధ్య పోరులో సాగినవే. కానీ జితేందర్ రెడ్డి ప్రజలకు న్యాయం జరగాలనే తన జీవితాన్ని పణంగా పెట్టిన తీరు చిత్రానికి హైలైట్. దర్శకుడు తన పనితనం బాగా చూపించాడు. పాటలపరంగా సన్నివేశపరంగా బాగున్నాయి. కాలేజీ సాంగ్ సరికొత్తగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం బాగుంది. పెద్ద స్టార్స్ లేకపోయినా వున్న నటీనటులతో దర్శకుడు బాగా చేయించుకోగలిగాడనే చెప్పాలి. సీరియస్ కథలో అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలున్నా ఇటువంటి సినిమాను యూత్ తప్పకుండా చూడతగ్గదనే చెప్పాలి. విడుదలకు ముందు వివిధ విద్యార్థి సంఘాల వారినుంచి ఏదైనా ఒత్తిడి వస్తుందని కథానాయకుడు భావించినా ఈ సినిమా చూశాక వారు కూడా జితేందర్ రెడ్డి జై అనిపించేలా వుంటుంది. 
రేటింగ్: 3.25/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్