Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వేత గ్లామర్‌తో 'మిక్చర్‌ పొట్లం'.. మిక్చర్‌లో అన్ని ఉన్నట్లే కథలో కూడా..

హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్‌ వ్యక్తిగత వివాదంలో నుంచి బయటపడి సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను మలుపు తిప్పుకోవాలని చేసిన ప్రయత్నమే 'మిక్చర్‌ పొట్లం'. అంతకుముందు తను చేసిన చిత్రాలకంటే భిన్నంగా ఉండాలని ప్రయత్

శ్వేత గ్లామర్‌తో 'మిక్చర్‌ పొట్లం'.. మిక్చర్‌లో అన్ని ఉన్నట్లే కథలో కూడా..
, శనివారం, 20 మే 2017 (10:51 IST)
నటీనటులు : శ్వేతా బసు ప్రసాద్‌, జయంత్‌, భానుచందర్‌ తదితరులు 
సంగీతం : మాధవపెద్ది సురేష్‌, నిర్మాతలు : వీరన్న చౌదరి, లంకలపల్లి, శ్రీనివాసరావు, లక్ష్మీ ప్రసాద్‌, దర్శకత్వం : ఎం.వి.సతీష్‌ కుమార్‌ 
 
హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్‌ వ్యక్తిగత వివాదంలో నుంచి బయటపడి సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను మలుపు తిప్పుకోవాలని చేసిన ప్రయత్నమే 'మిక్చర్‌ పొట్లం'. అంతకుముందు తను చేసిన చిత్రాలకంటే భిన్నంగా ఉండాలని ప్రయత్నించింది. దర్శకుడు సతీష్‌ ఆమెను కొత్తకోణంలో ప్రజెంట్‌ చేశారు. సీరియస్‌ అంశానికి వినోదం జోడించి చేసిన ప్రయత్నం ఎలా వుందో చూద్దాం. ఈ శుక్రవారమే విడుదలైంది. 
 
కథ: 
సువర్ణసుందరి (శ్వేతాబసు ప్రసాద్‌). తను ట్రావెల్స్‌ యజమాని. ఆమె బస్సుకు చాలా డిమాండ్‌ ఉంటుంది. ఆమె బస్సు ఎక్కాలని తహతహలాడుతుంటారు జనాలు. అమలాపురం నుండి షిర్డీకి సువర్ణసుందరి బస్సు బయలుదేరుతుంది. సరదాగా ఆటపాటలతో సాగుతున్న బస్‌ ఒక్కసారిగా ఆగిపోతుంది. నక్సలైట్లు ఈ బస్‌ను కిడ్నాప్‌ చేస్తారు. ఈ బస్సునే ఎందుకు కిడ్నాప్‌ చేశారు? అందులో ఎవరున్నారు? నక్సలైట్లు ప్రభుత్వానికి ఏం డిమాండ్‌ చేశారు? చివరికి ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌: 
సువర్ణ సుందరిగా శ్వేతాబసు ప్రసాద్‌ మెప్పించింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆమె చేసిన పెర్‌ఫార్మెన్స్‌ కంటే గ్లామరే ఎక్కువగా వుంది. దర్శకుడు ఆమెను తగిన మోతాదులో చూపించాడు. ఇక నక్సలైట్ నాయకుడిగా భానుచందర్‌ నటన బాగుంది. పోసాని హోం మినిష్టర్‌గా నటించాడు. తనదైనశైలిలో విలనిజాన్ని పండించడమే కాకుండా నవ్వించాడు. అలాగే మిగిలిన పాత్రల్లో జయంత్‌, గీతాంజలి జంట బాగుంది. కృష్ణభగవాన్‌, అలీ, జూనియర్‌ రేలంగి, కంటే వీరన్న చౌదరి ఎంటర్‌టైన్‌ చేశారు.
 
విశ్లేషణ:
సహజంగా రొటీన్‌ సినిమా ఫార్మెట్‌లో సాగినా మొదటి భాగంలో కామెడీగా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్‌లో ట్విట్ బాగుందనిపించేలా చేశాడు. ఆ తర్వాత సినిమా ఒక్కసారిగా నక్సలైట్ల ఎంట్రీతో కథ సీరియస్‌గా మారిపోతుంది. సెకండాఫ్‌ ఎలా ఉండబోతోందో అన్న టెన్షన్‌ని క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు సతీష్‌ కుమార్‌. ముఖ్యంగా శ్వేతాబసు నుంచి యూత్‌ ఏం కోరుకుంటారో అనేలా ఆమెను గ్లామర్‌కు పరిమితం చేశాడు. తన అందాలని బాగానే ప్రదర్శించింది. కిడ్నాప్‌ నేపథ్యంలో సెకండాఫ్‌ బాగానే రక్తికట్టింది. అయితే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింతగా స్క్రీన్‌ ప్లేని  మరింత పటిష్టం చేస్తే బాగుండేది. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుండి తనకు రావాల్సిన దాన్ని రాబట్టుకున్నాడు దర్శకులు సతీష్‌ కుమార్‌. 
 
చాలాకాలం తర్వాత మాధవపెద్ది సురేష్‌ సంగీతం అందించిన సినిమా ఇది. మూడు పాటలు బాగున్నాయి. ఇక ఛాయాగ్రాహకులు కళ్యాణ్‌ సమీ అందించిన సినిమాటో గ్రఫీ చాలా బాగుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇటీవలే చెన్నైలో ఈ చిత్రం ప్రివ్యూనుచూసి భాగ్యరాజా దంపతులు ఇతర సినీ ప్రముఖులు ప్రశసించారు. తెలుగులో ఈ చిత్రం పర్వాలేదు అనిపించేలా వుంది. టైటిల్‌కు తగినట్లు మిక్చర్‌లో అన్ని ఉన్నట్లే కథలో అన్ని అంశాలు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే నిడివి ఎక్కువ కావడంతో ఎక్కువ సేపు సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. 
 
రేటింగ్‌ : 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయానికి సంబంధించిన ఎల్లల్ని ఛేదించి పారేసిన బాహుబలి-2.. మరో 30 ఏళ్లు చెదరని రికార్డు సొంతం