Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుమ‌న్‌తేజ్, హెబ్బాప‌టేల్ న‌టించిన సందేహం మూవీ రివ్యూ

Sumantej  Hebbapatel

డీవీ

, సోమవారం, 24 జూన్ 2024 (13:47 IST)
Sumantej Hebbapatel
దిల్‌రాజు ఫ్యామిలీ హీరో సుమ‌న్‌తేజ్, హెబ్బాప‌టేల్ జంట‌గా న‌టించిన సందేహం మూవీ థియేట‌ర్లలో విడుదలైంది. హెబ్బాప‌టేల్ తో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తీశామని దర్శకుడు తెలియజేశారు. ఇప్పటికే ఇలాంటి కథలతో ఆమె చేసిన సినిమాలున్నా ఇది వైవిధ్యమైందిగా దర్శకుడు సతీష్ పరమవేద తెలియజేశాడు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
హర్ష (సుమన్ తేజ్) శృతి(హెబ్బా పటేల్) ప్రేమికులు. పెద్దలు అంగీకరించరని కారణంతో ఎరేంజ్ మేరేజ్ గా ప్లాన్ చేసుకుంటారు. అయితే తొలిరాత్రి శ్రుతిలో మార్పు వస్తుంది. కార్యానికి దూరంగా వుంచుకుంది. ఆ తర్వాత తనే శ్రుతి బాయ్ ఫ్రెండ్ అంటూ ఆర్య (సుమన్ తేజ్) వస్తాడు. ఇద్దరూ ఒకేలా వుండడం కథలో ట్విస్ట్. ఇలాంటి టైంలో ఆర్య శ్రుతికి దగ్గరవ్వడం హర్ష తట్టుకోలేడు. ఆ తర్వాత హర్ష చనిపోతాడు. తన అన్న హర్ష చనిపోవడంపై చెల్లెలకు అనుమానం వస్తుంది. ఆ తర్వాత ఏమయింది? హర్ష, ఆర్య ఇద్దరూ ఒకేలా ఎందుకున్నారు? కరోనా టైంలో కథ జరగడంతో కరోనాకు వీరికి లింక్ ఏమిటి? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:   
ఈ కథ చూడగానే ముక్కోణపు ప్రేమకథగా తెలిసిపోతుంది. టైటిల్ కు తగినట్లు సందేహం పెట్టి కథనంలో కొన్ని సందేహాలు కలిగేలా దర్శకుడు చేయగలిగాడు. కరోనాతో పాటు ఓ కొత్త పాయింట్ ని తీసుకున్నాడు దర్శకుడు. అందుకే మొదటి నుంచి కథ సాదాగా సాగుతూ ఆర్య రావడంతో మలుపు తిరుగుతుంది. ఇద్దరూ ఒకేలా వుండడం మరో ట్విస్ట్. ఇలా జరుగుతున్న క్రమంలో హర్ష చనిపోవడం కథను రన్ చేసింది.
 
ఇక సెకండ్ హాఫ్ ఊహించని విధంగా కథనం సాగుతుంది. అందులో కొన్ని మలుపుంటాయి. అయితే హర్ష ఆడిన ఓ అబద్ధం అతని క్యారెక్టర్ వున్న నిజం ఏమిటో అనేది ద్వితీయార్థంలో కనబడుతుంది. ఇలా ముక్కోణపు ప్రేమకథకు సస్పెన్స్ మర్డర్ ఎలిమెంట్ తో కొంత ఆసక్తి కలిగించాడు. కానీ ఇలాంటి కథలు గతంలో వచ్చినా సరికొత్తగా చేసని ఈ ప్రయోగంలో  కథ, కథనం కొంచెం కొత్తగా రాసుకున్నా క్లైమాక్స్ సరిగ్గా రాసుకుంటే బాగుండేది. ఇక కొన్ని సీన్స్ కూడా ఓ పక్కన కరోనా అంటూనే మరో పక్క మాములు సీన్స్ లా చిత్రీకరించారు.   సందేహం అనే క్రమంతో ముగింపు ఇస్తాడు.  
 
దిల్ రాజు వంశం నుంచి వచ్చిన సుమన్ తేజ్ హర్ష  రెండు పాత్రల్లో బాగానే డీల్ చేశాడు.  ఇక హెబ్బా పటేల్ సహజంగా గ్లామర్ తోపాటు నటనతో అలరిస్తుంది. ఎమోషన్ సీన్స్ లో కూడా మెప్పిస్తుంది. హీరో చెల్లి పాత్రలో రాశిక శెట్టి, బిగ్ బాస్ శ్వేతా వర్మ పోలీసాఫీసర్ గా పర్వాలేదనిపిస్తుంది. మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు నటించారు.
 
సాంకేతికంగా చూస్సితే, నిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటల్లో ఎక్కువగా రొమాన్స్ వుండేలా చేశాడు. నేపథ్య బాణీ ఓకేలా అనిపిస్తుంది. దర్శకుడిగా సతీష్ పరమవేద మ రిన్ని సినిమాలకు బాట వేశాడనే చెప్పాలి. నిర్మాతలు లావిష్ గా తీశారు.
 
అయితే సందేహాలతో కథనం సాగుతూ కొన్ని లాజిక్ లకు మిస్ చేశారనే చెప్పాలి. శ్రుతి వర్మ పరిశోధనలో థ్రిల్ మిస్ అయింది. కథలోని అంశం సరికొత్తగా వుంది. క్రైమ్, థ్రిల్లర్ అంశాలు మెచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ చిత్రపరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'