'సింగం3' రివ్యూ రిపోర్ట్.. పర్యావరణ పరిరక్షణకు పోలీస్ పవర్ తోడైతే..? అనుష్క లావుగా స్వీటీలా?
సింగం, సింగం2 సినిమాల్లో నటించిన విధంగానే సూర్య ఫుల్ ఎనర్జితో నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు నరసింహం ఈజ్ బ్యాక్ అనే ఫీలింగ్ ఆడియెన్‌కు కలుగుతుంది. డైలాగ్ డెలివరీలో కానీ, ఫైట్స్‌లో కానీ సూర్య
నిర్మాణ సంస్థ : స్టూడియో గ్రీన్, సురక్ష్ ఎంటర్‌టైన్మెంట్
నటీనటులు : సూర్య, అనుష్క, శృతిహాసన్, రాధికా శరత్‌కుమార్, నాజర్, అనూప్ సింగ్, సూరి, నీతూ చంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ : ప్రియన్
సంగీతం : హారీష్ జైరాజ్
నిర్మాతలు : జ్ఞానవేల్ రాజా, మల్కాపురం శివకుమార్
రచన, దర్శకత్వం : హరి
పోలీస్ పవర్‌ను తెలియజెప్పిన చిత్రాలు చాలానే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే తమిళ హీరో నటించిన తాజా చిత్రం ఎస్.3 (సింగం). ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి నరసింహం ఈ అంచనాలను అందుకున్నాడా? లేదా? అని తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
మంగళూర్ కమిషనర్‌ను హత్య చేయడంతో ఆ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం ఆ కేసును చేధించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి నరసింహం (సూర్య)ను సి.బి.ఐ ఆఫీసర్‌గా పంపుతుంది. మంగళూర్ చేరుకున్న నరసింహనికి అక్కడ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి సిటీలో అల్లర్లు సృష్టిస్తూ పెద్ద మనిషిలా చెలామణి అవుతున్నాడనే విషయాన్ని తెలుసుకుంటాడు.
అయితే, సరైన సాక్ష్యం దొరకడం కోసం తాను కూడా రెడ్డి మనిషిలానే నాటకం ఆడుతాడు. ఆ సమయంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ విద్య(శృతిహాసన్) తాను ఐపీఎస్‌కు ట్రయినింగ్ తీసుకుంటున్నానని, నరసింహంతో అబద్ధం చెప్పి అతనితో సన్నిహితంగా మెలిగి తాను చూసిన వాటిని ఆధారంగా చేసుకుని నరసింహంపై చెడుగా ఆర్టికల్ రాసేస్తుంది. కానీ అప్పటివరకు రెడ్డి మనిషిలా నాటకం ఆడిన నరసింహం ఉన్నట్లుండి తనెంత స్ట్రిట్ ఆఫీసర్ అర్థమయ్యేలా అందరినీ అరెస్ట్ చేసి తనేంటో విద్యకు అర్థమయ్యేలా చేస్తాడు.
ఆ తర్వాత నరసింహంతో ఆమె ప్రేమలో పడుతుంది. కమిషనర్ హత్య కేసుదర్యాప్తులో నరసింహంకు చాలా నిజాలు తెలుస్తాయి. కమిషనర్ హత్య వెనుక కేంద్ర మంత్రి (సుమన్), అతని కొడుకు, పారిశ్రామికవేత్త (విఠల్) ఉన్నారని తెలుస్తుంది. కానీ విఠల్ ఆస్ట్రేలియా పౌరుడు అక్కడ నుండి తన వ్యవహారాలను నడిపిస్తుంటాడు. అప్పుడు విఠల్‌ను పట్టుకోవడానికి నరసింహం ఏం చేస్తాడు? అసలు కమిషనర్ మరణానికి కారణం ఎవరు? చివరకు నరసింహం ఎదుర్కొనే సమస్యలేంటి? వాటి నుండి నరసింహం ఎలా భయటపడ్డాడనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష :
సింగం, సింగం2 సినిమాల్లో నటించిన విధంగానే సూర్య ఫుల్ ఎనర్జితో నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు నరసింహం ఈజ్ బ్యాక్ అనే ఫీలింగ్ ఆడియెన్‌కు కలుగుతుంది. డైలాగ్ డెలివరీలో కానీ, ఫైట్స్‌లో కానీ సూర్య నటన సింప్లీ సూపర్బ్. సింగంలోని సూర్య, సింగం-2లోని సూర్యకు మూడో సీక్వెల్, సూర్య నటనలోకానీ ఎక్స్‌ప్రెషన్‌లో కానీ, ఎమోషన్‌ను క్యారీ చేసిన తీరులో కానీ తేడా కనపడదు. కావ్య పాత్రలో అనుష్క తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. అయితే అనుష్క చాలా లావుగా కనపడింది. శృతిహాసన్ గ్లామర్ లుక్‌తో ఆకట్టుకుంది. విలన్‌గా నటించిన అనూప్ సింగ్ విలనిజాన్ని చక్కగానే ప్రదర్శించాడు. ఇక నాజర్, రాధారవి, సూరి సహా అందరూ వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
ఇక సాంకేతికంగా విశ్లేషిస్తే.. దర్శకుడు హరి... హర్రీగానే కెమెరాను పరెగెట్టించడంలో తనకు సాటిలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో కెమెరా పరుగెడుతుంటే మనం పరుగెత్తాం అనిపించేలా ఉంది. తొలి రెండు పార్టులకు భిన్నంగా హరి ఈసారి పర్యావరణం అనే కాన్సెప్ట్‌ను తీసుకుని, దాన్ని మలిచిన తీరు బావుంది. అయితే మూడో పార్ట్ చూస్తున్నంత సేపు సింగం-2 చూస్తున్న భావనే ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే రెండు పార్టులకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌తో కాకుండా హారీష్ జైరాజ్‌తో మ్యూజిక్ చేయించారు. సంగీతం అంతగా ఆకట్టుకోలేదని చెప్పారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేదు. ప్రియన్ సినిమాటోగ్రఫీ బావుంది.