విన్నర్ రివ్యూ రిపోర్ట్.. స్పోర్ట్స్ డ్రామా.. ఫ్రై డే పాప్ కార్న్ ఎంటర్‌టైనర్..
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (
సినిమా పేరు : విన్నర్
సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు.
కెమెరా: చోటా కె.నాయుడు,
సంగీతం: తమన్,
ఆర్ట్: ప్రకాష్,
కథ: వెలిగొండ శ్రీనివాస్,
మాటలు: అబ్బూరి రవి,
నృత్యాలు: రాజు సుందరం, శేఖర్,
ఫైట్స్: స్టన్ శివ, రవివర్మ,
ఎడిటర్: గౌతమ్ రాజు,
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:గోపీచంద్ మలినేని.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్నినిర్మించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 24వ తేదీ (శుక్రవారం) విన్నర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. గోపిచంద్ ఈ చిత్రాన్ని పక్కాగా రూపొందించాడని.. తొలి భాగం మొత్తం కామెడీ, యాక్షన్ బేస్ చేసుకుని రన్ చేశారు. హీరో, హీరోయిన్ వెంట పడటం లాంటి రోటీన్ సీన్లతో సినిమా సాగింది. తొలి భాగంలో పృథ్వీ కామెడీ పండించాడు. రెండో అర్థభాగం యావరేజ్ మార్కులు కొట్టేసింది. మొత్తానికి 'విన్నర్' మూవీపై ఫస్ట్ షోకే జస్ట్ యావరేజ్, రొటీన్ సినిమా అనే టాక్ వచ్చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
విన్నర్‌లో సాయిధరమ్ తేజ్ (రామ్) జర్నలిస్టుగా కనిపిస్తాడు. రకుల్ ప్రీత్ సింగ్ సితారగా కనిపిస్తుంది. సాయిధరమ్ తేజ్‌తో లవ్ సీన్స్ అదరగొట్టింది. గ్లామర్ బాగానే ఆరబోసింది. ప్రేమలో గెలిచేందుకు హీరో పడే పాట్లే ఈ సినిమా. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. అనసూయ ఐటమ్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నటీనటుల పెర్‌ఫార్మెన్స్:
సాయి ధరమ్ తేజ్ నటనతో అదరగొట్టాడు. యాక్షన్, డ్యాన్స్, డైలాగ్ డెలీవరీలో సూపర్ అనిపించుకున్నాడు. అథ్లెట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ అద్భుతంగా నటించింది. గ్లామర్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. పృథ్వీ, జగపతి బాబు, వెన్నెల కిషోర్, థాకూర్ అనూప్ సింగ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
రేటింగ్: 3.5/5
విన్నర్ ప్లస్ పాయింట్స్ :
సాయి ధరమ్ తేజ్ నటన, రకుల్ గ్లామర్
వెన్నెల కిషోర్, పృథ్వీ సీన్స్
సంగీతం, నేపథ్య సంగీతం
స్మార్ట్ డైరక్షన్
పృథ్వీ కామెడీ, కమర్షియల్ ఎలెమెంట్స్
నెగటివ్ పాయింట్స్:
హీరోయిన్ పాత్ర పరిమితం కావడం
కథకు లింకులు లేకపోవడం.
అయితే విన్నర్ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తాడు. కమెడీ పరంగా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చేసింది. ప్రేక్షకులు బోర్‌గా ఫీలవ్వరు. మొత్తానికి ఫ్రై డే పాప్ కార్న్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు.