Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''రాయలసీమ లవ్‌ స్టోరీ'' రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో తెలుసా?

Advertiesment
Rayalaseema Love Story
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (17:13 IST)
నటీనటులు : వెంకట్‌, హ్రిశాలి, పావని, నల్ల వేణు, నాగినీడు తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : రామ్‌ మహేందర్‌, 
సంగీతం : శ్రీ సాయి ఏలేందర్‌, 
ఎడిటర్‌ : వినోద్‌ అద్వే, 
నిర్మాతలు : రాయల్‌ చిన్నా, నాగరాజు, 
దర్శకత్వం : రామ్‌ రణధీర్‌.  
 
నూతన నటీనటులు వెంకట్‌ హీరోగా హ్రిశాలి, పావనిలు హీరోయిన్లుగా రామ్‌ రణధీర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాయలసీమ లవ్‌ స్టోరీ'. విడుదలకు ముందు రాయలసీమ పేరుతో వస్తున్న ఈ చిత్రంలో అసభ్యకరంగా పోస్టర్లు వున్నాయనీ, మా ప్రాంతం వారి మనోభావాల్ని దెబ్బతీసేట్లుగా వుందని అక్కడి కొందరు కోర్టుకేసు వరకు వెళ్ళారు. 
 
సెన్సార్‌ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం శుక్రవారమే విడుదలైంది. మరి అదెలావుందో చూద్దాం.
 
కథ:
జీవితంలో అమ్మాయితో ప్రేమ అనేవి లేకపోతేనే మగాడు ప్రశాంతంగా ఉంటాడు అనుకునే వ్యక్తి కష్ణ (వెంకట్‌). అలాంటి వ్యక్తి పోలీసు ఆఫీసర్‌ అవ్వాలనే గోల్‌ను కూడా పక్కన పెట్టి రాధ (హ్రిశాలి) ద్వేషించే క్రమంలో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆ ప్రేమ అర్ధంతరంగా విఫలం అవుతుంది. దేవదాస్‌లా మారిపోయిన అతనికి ఓ వార్త షాక్‌కు గురిచేస్తుంది. అది ఫ్లాష్‌బ్యాక్‌లో తన కథ గుర్తుకు తెస్తుంది. అది ఏమిటి? ఆ తర్వాత అతని ప్రేమ ఏమయింది? అనుకున్న గోల్‌ నెరవేరిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఇది రొటీన్‌ లవ్‌స్టోరీ కథే అయినా దర్శకుడు తీసిన విధానం కొత్తగా ప్రయత్నించాడు. ఇందులో జబర్‌దస్త్‌లో చేసిన గెటప్‌ సీన్‌ పాత్ర ఎంటర్‌టైన్‌ చేస్తుంది. నల్లవేణు పాత్ర హీరోపాటు ట్రావెల్‌ అవుతుంది. హీరో హీరోయిన్లు పాత్రమేరకు బాగానే నటించారు. హీరో వెంకట్‌ నటనపరంగా మంచి మార్కులే పడ్డాయి. ఇక పోస్టర్లు, ట్రైలర్‌లో చూపించిన విధంగా యూత్‌ కోసం అర్జున్‌రెడ్డి తరహా సీన్లు రెండు, మూడు చోట్ల వున్నాయి. అవి కేవలం వారిని ఎంటర్‌టైన్‌ చేయడమే అయినా సన్నివేశపరంగా దర్శకుడు దాన్ని మలుచుకున్నాడు. 
webdunia
 
హీరోహీరోయిన్లు కూడా కాజువల్‌గా నటించేశారు. మొదటి భాగమంతా సరదాగా, ఆకతాయిగా నటిచే కథ ద్వితీయార్థంలో హృదయాల్ని టచ్‌ చేసే సెంట్‌మెంట్‌తో కంట్రోల్‌ చేశాడు దర్శకుడు. సాహిత్యం, సంగీతం పెద్ద చిత్ర స్థాయిలో వుంది. వినడానికి చాలా వినసొంపుగా ఆహ్లాదరకంగా వున్నాయి. ఇవి చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. 
 
ఇలాంటి కథను కొత్తవారితో తీసిన దర్శక నిర్మాతల్ని అభినందించాలి. ఏదో బ్రహ్మాండమైన సినిమాను తీశామని కాకుండా యూత్‌ఫుల్‌ చిత్రం తీశారని తెలుస్తోంది. హ్రిశాలి, పావనిలు మంచి నటన కనబరిచారు. మిగతా నటులు అయినటువంటి నాగినీడు తదితరులు వారి పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేకూర్చారు. కొన్ని సన్నివేశాలు అయితే అసలు బాలేదు అన్న సమయంలో మంచి ట్విస్ట్‌తో దర్శకుడు తెరకెక్కించిన తీరు మెచ్చుకోదగినదే అని చెప్పాలి. అలాగే శ్రీ సాయి ఏలేందర్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. 
 
రాయల్‌ చిన్న, నాగరాజులు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 
దర్శకుడు కొత్తయినా ప్రేమకథను కనెక్ట్‌ అయ్యే విధంగా చూపేప్రయత్నంలో కొన్ని పరిమితులు దాటాడు. అయినా సెన్సార్‌ లభించడం విశేషం. సెకండాఫ్‌లో అసలు కథ, కథనం బాగుండాలని దానిపై శ్రద్ధ పెట్టాడు. కానీ వాటిని మరింత ఆసక్తికరంగా తీస్తే చిత్రం పెద్దస్థాయిలో వుండేది.
 
సంభాషణల పరంగా సన్నివేశపరంగా రాసుకున్నాడు. హీరో క్యారక్టరైజెశషన్‌ ఇది వరకే చాలా సినిమాల్లో చూసేసినట్టుగా అనిపిస్తుంది.  ప్రేమకథకు కొన్ని అనవసరమైన సన్నివేశాలను ఇరికించి, కొన్ని ఆకట్టుకోని వీక్‌ ఎమోషన్స్‌ తో దెబ్బ తీశారు. సినిమాటోగ్రఫీ పరవాలేదు. ప్రేమించిన మనిషి కోసం ఏమయినా చెయ్యొచ్చు ఆఖరికి వారి ప్రేమను కూడా త్యాగం చెయ్యొచ్చు అనే కాన్సెప్ట్‌ను ఇంకా బాగా తీర్చిదిద్దితే బాగుండేది. అక్కడక్కడా వీక్‌ ఎమోషన్స్‌ లాజిక్‌ లను పక్కన పెడితే లవ్‌ స్టోరీలను ఇష్టపడే వారికి నచ్చొచ్చు. ముఖ్యంగా అబ్బాయిలకు నచ్చే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీముఖికి బిగ్ బాస్ హౌజ్‌లో పెళ్లిచూపులు.. పెళ్లికొడుకు ఎవరో తెలుసా? (Video)