Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''రాధ'' రివ్యూ రిపోర్ట్: రొటీన్ స్టోరీ.. కామెడీ పండింది.. టైమ్ పాస్ కోసం చూడొచ్చు..

పోలీసు డిపార్ట్‌మెంట్‌కి జరిగిన అన్యాయాన్ని ఓ పోలీస్ అధికారి ఎలా ఎదిరించాడనే పాయింట్‌తో సినిమా నడుస్తుంది. ఇందుకు లవ్, కామెడీని యాడ్ చేసి తెరకెక్కించారు. మొదటి భాగం మొత్తం వినోదం, రెండు పాటలతో ముగుస్త

''రాధ'' రివ్యూ రిపోర్ట్: రొటీన్ స్టోరీ.. కామెడీ పండింది.. టైమ్ పాస్ కోసం చూడొచ్చు..
, శుక్రవారం, 12 మే 2017 (17:27 IST)
తారాగాణం : శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవి కిషన్, ఆశిష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు తదితరులు 
దర్శకత్వం : చంద్రమోహన్ 
రేటింగ్: 2.75
పతాకం : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
సంగీతం: రాధన్
సినిమాటోగ్రాఫీ : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు : భోగవల్లి బాపినీడు
విడుదల తేదీ : 12, మే 2017. 
 
''శతమానం భవతి'' చిన్న సినిమా అయినా.. జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇలాంటి చిన్న సినిమాలతో నటించినా స్టార్ హోదాను పెంచుకుంటూ దూసుకుపోతున్న శర్వానంద్.. తాజాగా రాధ అంటూ తెరపైకి  వచ్చాయి. రాధ సినిమాపై ప్రేక్షకులు అంచనాలను పెంచుకున్నారు. కానీ రొటినీ రాధాకృష్ణుల కథగా ఇది మిగిలిపోయింది. శుక్రవారం రిలీజైన శర్వానంద్ రాధ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళ్తే.. 
చిన్ననాటి నుంచి పోలీసు కావాలనుకున్న రాధాకృష్ణ (శర్వానంద్) వరంగల్‌లో ఎస్ఐ అవుతాడు. పోలీసులను గౌరవించే ఇతను వరంగల్‌లో పోస్టింగ్ వచ్చాక అక్కడ రాధ (లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. రాధ కూడా అతనిని ఇష్టపడుతుంది. ఈలోగా రాధాకృష్ణ హైదరాబాదుకు బదిలీ అవుతాడు. క్రైమ్ సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో రాధాకృష్ణ క్రిమినల్స్ వెంట పడుతుంది. ఇంతలో సూరిబాబు (ఆశిష్ విద్యార్థి)ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిపోయి, మంత్రి సుజాత (రవిరకిషన్)ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు. 
 
సుజాత సీఎం పదవి కోసం మంచివాడిగా నటిస్తుంటాడు. ఈ క్రమంలో ప్రజల్లో సింపతీ కోసం బాంబు పేలుడు తన మీద తానే చేయిస్తాడు. ఈ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ విషయం రాధాకృష్ణకు తెలస్తుందా? సుజాతను రాధాకృష్ణ వదిలిపెడతాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ: 
పోలీసు డిపార్ట్‌మెంట్‌కి జరిగిన అన్యాయాన్ని ఓ పోలీస్ అధికారి ఎలా ఎదిరించాడనే పాయింట్‌తో సినిమా నడుస్తుంది. ఇందుకు లవ్, కామెడీని యాడ్ చేసి తెరకెక్కించారు. మొదటి భాగం మొత్తం వినోదం, రెండు పాటలతో ముగుస్తుంది. రెండో భాగంలో కథకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ ప్రేక్షకుడికి రొటీన్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మరీ రొటీన్. 
 
కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే వేగంగా లేకపోవడమే ''రాధ''కు మైనస్. అయితే శర్వానందన్ నటన బాగుంది. పాత్రకు ఒదిగిపోయాడు. శర్వానంద్, సప్తగిరిల మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పంచాయి. అలానే షకలక శంకర్ కూడా తన కామెడీతో నవ్వించాడు. లావణ్యత్రిపాఠి తెరపై చాలా అందంగా కనిపించింది. నటన పరంగా కూడా ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలన్నీ ఇతర సినిమాలను పోలినట్లు వుంటాయి. సో రాధ రొటీనే.. కాకపోతే టైమ్ పాస్ కావాలనుకునేవారు సినిమా చూడొచ్చు.
 
హైలైట్స్:
శర్వానంద్ నటన 
కామెడీ సన్నివేశాలు 
స్క్రీన్ ప్లే.
 
డ్రాబాక్ : 
రొటీన్ స్టోరీ
కథలో కొత్తదనం లేకపోవడం, 
 
రేటింగ్ : 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలలన్నీ నావే... కలకాలం నీవే... ఎక్కడికో తీసుకెళ్లే ఇళయరాజా...(video)