Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శంకర రివ్యూ రిపోర్ట్.. సమాజానికి సర్దుకుపోని యువకుడి కథే.. ఈ ఏడాది నారా రోహిత్‌కు ఐదో మూవీ..

జ్యో అచ్యుతానంద జంట మళ్లీ శంకర సినిమాలో కనిపించింది. తాతినేని సత్య ప్రకాష్ దర్శకత్వంలో విడుదలైన శంకరలో హీరో నారా రోహిత్, రెజీనా జంటగా నటించారు. శంకర సినిమా తమిళ మౌనగురుకు రీమేక్. ఈ సినిమా శుక్రవారం (2

Advertiesment
Nara Rohith
, శుక్రవారం, 21 అక్టోబరు 2016 (12:06 IST)
జ్యో అచ్యుతానంద జంట మళ్లీ శంకర సినిమాలో కనిపించింది. తాతినేని సత్య ప్రకాష్ దర్శకత్వంలో విడుదలైన శంకరలో హీరో నారా రోహిత్, రెజీనా జంటగా నటించారు. శంకర సినిమా తమిళ మౌనగురుకు రీమేక్. ఈ సినిమా శుక్రవారం (21 అక్టోబర్ 2016) రిలీజైంది. 
 
కథలోకి వెళితే.. సమాజానికి తగినట్లు తనను మలచుకోలేక ఇబ్బంది పడే కాలేజీ స్టూడెంట్‌గా నారా రోహిత్ నటించాడు. తన కోపాన్ని అణుచుకోలేక చాలా సందర్భాల్లో చిక్కులు కొనితెచ్చుకతుంటాడు. అతని ప్రవర్తన అతని తల్లికి గానీ సోదరునికి గానీ నచ్చదు. కొన్ని పరిస్థితుల్లో తన సిటీ నుంచి బయటపడతాడు రోహిత్. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కొందరు పోలీసులు ఓ యాక్సిడెంటును చూస్తారు. ఆ ప్రమాదంలో గాయపడిన బెంగుళూరు వ్యాపారి కొడుకును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా వారికి పెద్ద మొత్తంలో సొమ్ము కనిపిస్తుంది.
 
వాళ్ళు ఆ వ్యాపారి కొడుకును చంపేసి ఆ డబ్బుతో ఉడాయిస్తారు. అయితే అనుకోకుండా రోహిత్ ఈ కేసులో చిక్కుకుంటాడు. ఈ కేసు నుంచి బయటపడి తనను నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నారా రోహిత్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు రెజీనా ఎలా సహాయపడుతుంది. ఆమెతో లవ్వాయణం ఎలా సాగుతుందనే తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే. 
 
జ్యో అచ్యుతానంద సక్సెస్ తర్వాత శంకర సినిమా ద్వారా నారా రోహిత్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ  ఏడాదిలో ఐదో సినిమాగా రిలీజ్ చేశాడు. తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జ్యో అచ్యుతానంద మూవీల్లో రోహిత్ నటించాడు. కాగా శంకర సినిమా చాలా కాలం క్రితమే పూర్తయినా.. రిలీజ్‌లో జాప్యం జరిగింది. ఈ చిత్రంలో తమ పాత్రలకు రోహిత్, రెజీనా న్యాయం చేశారని రివ్యూ టాక్ వస్తోంది. పాత కథనే కొత్తగా చూపించేందుకు ప్రయత్నించారు. 
 
మూవీ రేటింగ్ : 3/5 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి తెలంగాణ పౌరుడు ప్రేరణ పొందేలా సీఎం కేసీఆర్ బయోపిక్ : మధుర శ్రీధర్