Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాజిక్‌లేని సినిమాలు ` గగుర్పాటు కలిగించే రక్తపాతాలు

sknada poster
, శనివారం, 30 సెప్టెంబరు 2023 (20:49 IST)
sknada poster
ఈమధ్య సినిమాల్లో పెద్దగా లాజిక్‌లు వుండడంలేదు. ముఖ్యంగా భారీ సినిమాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే విడుదలైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద గురించి చెప్పుకోవాల్సిందే. రామ్‌ పోతినేని ఇందులో హీరోగా నటించాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత అంత మాస్‌ సినిమా ఇది. ఇందులో కథ పెద్దగా లేకపోయినా, ఇద్దరు సి.ఎం. లను కేంద్రంగా చేసుకుని,  కేవలం మాస్‌ ప్రేక్షకుల కోసం బోయపాటి తీసినట్లుంది. ఇందులో ఎంత వయొలెన్స్‌ ఉందంటే చెప్పడానికి ఇబ్బందే. మరోవైపు నేపథ్యం సంగీతం సౌండ్‌ కూడా మరీ శృతిమించింది. చెవులు రొదలు వినిపిస్తాయి. కానీ రెండు రోజుల్లో 27.6 కోట్ల కలెక్షన్స్ జరిగాయని చిత్ర యూనిట్ తెలుపుతోంది. 
 
webdunia
peda kapu1


ఇక రెండో సినిమా పెదకాపు1. ఇది ముందుగానే చెప్పినట్లుగా ఎన్‌.టి.ఆర్‌. కొత్తగా రాజకీయపార్టీ పెట్టినప్పుడు జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. కోనసీమంలోని కొన్ని గ్రామాల పరిధిలోని ఒకే కుటుంబం పెత్తనం చేస్తుంది. వ్యతిరేకంగా మరో వర్గం వుంటుంది. మిగిలిన ప్రజల్లో కొంతమంది ఇరువర్గాలవైపు వుంటారు. ముఖ్యంగా యూత్‌ వారిని నమ్ముకుని బానిసలుగా వుంటారు. అలాంటి టైంలో విరాట్‌ కర్ణ అనే కొత్త కుర్రాడు పెదకాపు. అతను ఏవిధంగా ఆ ఇద్దరి పెత్తందార్లను ఎదిరించి తను ఊరందరికీ పెదకాపుగా నిలిచాడు అనేది కథ. ఈ కథను తెలుగుదేశం పార్టీ పేరు వాడడంవల్ల మైనస్‌ అయిందని విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు. ఆ అంశం లేకుండా సినిమాను తీస్తే మరోలా వుండేది. 
 
తెలుగుదేసం పేరు మైనెస్సా 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనేది తెలిసిందే. ఈ టైంలో ఇటువంటిసినిమా రావడం కూడా లాభించలేదనే చెప్పాలి. హీరో పరంగా విరాట్‌ బాగా సూటయ్యాడు. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తను తీసిన నారప్ప ఫార్మెట్‌లో ఈ సినిమా తీశాడు. ఆ మధ్య కాంతార సినిమా వచ్చింది. గ్రామాల్లోని జాతరలు, కట్టుబాట్లు చూపిస్తూ భిన్నంగా తీశారు. శ్రీకాంత్‌ అడ్డాల గూడా ఆ కోణంలో వెళ్ళాలని చూసి పార్టీ పేరు పెట్టే మిస్టేక్‌ చేశాడని చెప్పకతప్పదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోన్న లైకా ప్రొడక్షన్స్