Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన 'మేము'... రివ్యూ రిపోర్ట్

మేము మూవీ నటీనటులు: సూర్య, అమలాపాల్‌, కార్తీక్‌ కుమార్‌, విద్యప్రదీప్‌, బిందుమాధవి తదితరులు; నిర్మాత (తెలుగు): జూలకంటి మధుసూదన రెడ్డి, కెవివి సత్యనారాయణ, దర్శకత్వం: పాండిరాజ్‌. సూర్య భిన్నమైన కథలతో తన ఇమేజ్‌ను చూసుకోకుండా కథలను ఎంచుకుంటాడు. గజని, సె

తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన 'మేము'... రివ్యూ రిపోర్ట్
, శుక్రవారం, 8 జులై 2016 (15:00 IST)
మేము మూవీ నటీనటులు: సూర్య, అమలాపాల్‌, కార్తీక్‌ కుమార్‌, విద్యప్రదీప్‌, బిందుమాధవి తదితరులు; నిర్మాత (తెలుగు): జూలకంటి మధుసూదన రెడ్డి, కెవివి సత్యనారాయణ, దర్శకత్వం: పాండిరాజ్‌.
 
సూర్య భిన్నమైన కథలతో తన ఇమేజ్‌ను చూసుకోకుండా కథలను ఎంచుకుంటాడు. గజని, సెవెన్త్‌ సెన్స్‌, యముడు వంటివే కాకుండా ఆత్మల నేపథ్యంలో రాక్షసుడు అనే చిత్రంలో రెండు పాత్రలు పోషించాడు. ఈసారి తమిళంలో 'పసంగ-2' చేశాడు. దాన్ని తెలుగులో మేముగా అనువదించారు. అసలు మేము అంటే ఏమిటి? చిన్నపిల్లల చిత్రాల దర్శకుడుగా పేరుపొందిన పాండరాజ్‌తో తను ఎటువంటి సినిమా చేశాడో చూద్దాం.
 
కథ :
బిందుమాదవి గర్భంతో వున్నప్పుడు ఏడున్నర నెలలో ఆపరేషన్‌ చేయగా కొడుకుకు జన్మనిస్తుంది. మరోవైపు కార్తీక్‌ కుమార్‌ దంపతులకు ఇదే పరిస్థితో ఆడపిల్ల పుడుతుంది. ఇద్దరు పిల్లలు చాలా చురుకైనవారు. ప్రతీదీ ప్రశ్నించే తత్త్వం. ఇతర పిల్లలకంటే భిన్నంగా కన్పిస్తారు. అల్లరి చాలా ఎక్కువే. దాదాపు ఐదారు  స్కూల్స్‌ వీరి అల్లరికి తట్టుకోలేక టీసి ఇచ్చేస్తారు. ఆఖరికి వీరి అల్లరిని కంట్రోల్‌ చేయాలంటే హాస్టలే మార్గమని అందులో వేస్తారు. అక్కడ కూడా వీరు మారకపోవడంతో.. తిరిగి ఇంటికి పంపిచేస్తారు. ఈ ఇద్దరు పిల్లల్లో హైపర్‌ ఆక్టివిటీ వుందనీ, దాని కోసం డాక్టర్లు రకరకాల పరీక్షలు చేస్తారు కానీ సరిచేయలేకపోతారు. వారుండే కాలనీలోనే డాక్టర్‌ సూర్య, టీచర్‌ అమలాపాల్‌లు వీరిని గమనించి.. తమ పర్యవేక్షణలో ఆ ఇద్దరి పిల్లల్ని మారుస్తారు. వారితోపాటే ఇతర పిల్లల్ని కూడా ఎలా ట్రీట్‌ చేశారు. ఈ పరిణామాలవల్ల తల్లిదండ్రులు ఏం నేర్చుకున్నారనేది? మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
డాక్టర్‌గా సూర్య బాగా నటించాడు. పిల్లల్ని ట్రీట్‌ చేసే డాక్టర్‌ ఎలా వుండాలి.. వారికి తగినవిధంగా వుంటూ, ఏవిధంగా తన దారిలో తెచ్చుకోవాలనే కిటుకులన్నీ తను ప్లేచేసే విధానం ఆకట్టుకుంటుంది. అదేవిధంగా పిల్లల టీచర్‌లో వుండాల్సిన ఓపిక, వారికి ఎలా బోధించాలో తెలిసిన టీచర్‌గా అమలాపాల్‌ నటించి మెప్పించారు. మిగిలిన నటీనటులు వారివారి పాత్రలకు న్యాయం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాబా మీద నుంచి కుక్కనలా పడేస్తే.. పెట్స్ అంటే పడిచచ్చే త్రిషకు కోపం రాదా?