మెహబూబా రివ్యూ రిపోర్ట్.. ఆకాష్‌కు ఆ ముద్ర పడిందా?
ఆకాష్ మెహబూబాతో కమర్షియల్ హీరో ముద్రేసుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్ పరంగా మెప్పించిన ఆకాష్, కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్
సినిమా పేరు - మెహబూబా
జానర్ - లవ్ ఎంటర్‌టైనర్
తారాగణం - ఆకాష్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షాయాజీ షిండే తదితరులు
దర్శకత్వం - పూరి జగన్నాథ్
నిర్మాత - పూరి కనెక్ట్స్
సంగీతం - సందీప్ చౌతా
దర్శకుడు పూరీ జగన్నాథ్, తన కుమారుడిని హీరోగా తెరంగేట్రం చేస్తూ రూపొందించిన సినిమా మెహబూబా. పూరీ జగన్నాథ్ తన స్టైల్ డైరక్షన్‌ను పక్కనబెట్టి.. లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం..
కథలోకి వెళ్తే..
రోషన్ (ఆకాశ్ పూరి)ని ఓ కల వెంటాడుతూ వుంటుంది. సైనికుడైన ఆకాశ్ పూరీని ఎవరో చంపేసినట్లు.. హిమాలయాల్లో ఆకాశ్ పూరి ఎవరికో మళ్లీ వస్తానని మాట ఇచ్చినట్లు ఆ కల సారాంశం. అదే సమయంలో లాహోర్‌లో ఉన్న అఫ్రీన్ (నేహా శెట్టి)కు కూడా ఇలాంటి కలే వస్తుంది. తనను ఎవరో చంపేసారని భయపడుతూ వుంటుంది. అంతేగాకుండా ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఆమెకు ఇష్టం వుండదు. ఇంకా చదువుకోవాలనే కారణంతో భారత్‌కు వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్లందరూ అఫ్రీన్‌ను ఇండియా పంపించడానికి భయపడినా.. అఫ్రీన్ మాత్రం తనకు సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందంటూ భారత్ వస్తుంది.
హైదరాబాద్ చేరి అఫ్రీన్‌ను రోషన్ ఓ ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఆ సమయంలో అతని ముఖం చూడని రోషన్ అతనిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది. అఫ్రీన్ భారత్‌కు వెళ్లడం.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న నాదిర్ (విషు రెడ్డి)కు నచ్చదు. దీంతో అఫ్రీన్‌ను మళ్లీ పాకిస్థాన్‌కు రప్పిస్తాడు. పాకిస్తాన్ వెళ్లేందుకు బయలుదేరిన అఫ్రీన్‌కు.. అదే ట్రైన్‌లో హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్తున్న రోషన్‌ను కలుస్తాడు. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని థ్యాంక్స్ చెప్తుంది.
ట్రెక్కింగ్‌కు వెళ్లిన రోషన్‌కు అక్కడ తన గత జన్మకు సంబంధించిన విషయాలు గుర్తుకొస్తాయి. గత జన్మలో తాను ప్రేమించిన అమ్మాయే ఈ జన్మలో అఫ్రీన్‌గా మళ్లీ పుట్టిందని తెలుసుకున్నాక.. అఫ్రీన్‌ను రోషన్ కలిశాడా? ఆమె ప్రేమను తిరిగి పొందగలిగాడా అనేది తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
ఆకాష్ మెహబూబాతో కమర్షియల్ హీరో ముద్రేసుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్ పరంగా మెప్పించిన ఆకాష్, కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్రను ఎంచుకున్నాడనిపించక తప్పదు. యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే ఛాన్స్ మాత్రం దక్కలేదు. హీరోయిన్‌గా పరిచయం అయిన నేహాశెట్టి పరవాలేదనిపించింది. విలన్‌గా విషు రెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్ పాత్రల్లో కనిపించారు.
పునర్జన్మల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పూరి తన ప్రేమకథకు ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని జోడించాడు. మెహబూబాలో పూరి మార్క్ హీరోయిజం కరువైంది. డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవటం నిరాశ కలిగించింది.
ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
తొలి అర్థభాగంలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే
పూరి మార్క్ లేదు