Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

ఈనాటి ట్రెండ్ కు తగిన కథతో #మాయలో : రివ్యూ

Advertiesment
mayalo poster
, శనివారం, 16 డిశెంబరు 2023 (09:49 IST)
mayalo poster
నటీనటులు: నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, RJ హేమంత్ తదితరులు
సాంకేతికత: రచన, దర్శకత్వం: మేఘా మిత్ర పేర్వార్, నిర్మాతలు : షాలిని నంబు, రాధా కృష్ణ నంబు, బేనర్: ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌
 
ట్రెండ్ నుబట్టి యూత్ ఆలోచనలకు అనుగుణంగా గతంలో పెల్లిచూపులు, ఈ నగరానికి ఏమయింది? వంటి సినిమాలు విడుదలయి కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. తాజాగా నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, RJ హేమంత్ నటించిన #మాయలో చిత్రాన్ని ఆ కోణంలో యూత్ నిర్మాత, సినిమా రంగంలో అనుభవం వున్న షాలిని నిర్మించారు. ఈ శుక్రవారమే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
మాయ (జ్ఞానేశ్వరి), క్రిష్ అలియస్ శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధు (భావన) చిన్ననాటి స్నేహితులు. మాయ (జ్ఞానేశ్వరి)  తన ప్రియుడు పాల్ ను వివాహం చేసుకోవడానికి సిద్దం అవుతుంది. ఈ క్రమంలో మాయ.. క్రిష్, సింధుని తన వివాహానికి ఆహ్వానిస్తుంది. దాంతో వీరిద్దరూ కలిసి మాయ పెళ్లికి ఓ కారును అద్దెకు తీసుకుని రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అయితే వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? క్రిష్, సింధూల మధ్య ఉన్న బంధం ఎలాంటిది? అలాగే క్రిష్, మాయల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? మంచి స్నేహితులుగా ఉన్న మాయ, సింధూలు ఎందుకు దూరం అయ్యారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   
 
సమీక్ష:
ఈ సినిమా ట్రైలర్ చూడగానే ముక్కోణపు ప్రేమకథగా అనిపించింది. పెద్దలు చెప్పిన అమ్మాయిని పెండ్లిచేసుకోవాలని ఆ తర్వాత తనకు నచ్చని అమ్మాయితో మాట్లాడాల్సి వస్తుందన్న చిన్న క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఓటీటీ కంటెంట్ తరహాలో వున్నా వెండితెరపైనా అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో తెరకెక్కించారు దర్శకుడు. పనిలో పనిగా ఇప్పటి యువతరం మాట్లాడుకునే కొన్ని పదాలు కూడా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కలిసిపోతాయి. ఎక్కడా వల్గారిటీ అనిపించకపోయినా సంభాషణల రూపంలో మసాలా జోడించి మాయ చేశాడు దర్శకుడు. రోడ్ జర్నీ నేపథ్యం గనుక సరదాగా సాగుతుంది. నరేష్ అగస్త్య, భావనలిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఎక్కడా బోర్ లేకుండా సినిమాను నడిపించారు. 
 
నరేష్ అగస్త్య అనగానే మత్తు వదలరా, పంచతంత్ర సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ పాత్రకు తను బాగా సూటయ్యాడు. భావనతో తన కెమిస్ట్రీ బాగా కుదిరిందది. ఇద్దరూ రోడ్డు జర్నీలో టామ్ జెర్రీ గుర్తొచ్చేలా నటించి ఆకట్టుకున్నారు. అలాగే మాయ పాత్రలో జ్ఞానేశ్వరి తన మార్కు మోడ్రన్ గాళ్ గా మెప్పిస్తుంది. ముగింపు సన్నివేశాల్లో భావనతో పోటీ పడినటించింది. వీరిద్దరి సంభాషణలు క్లైమాక్స్ లో నేటి యూత్ ని బాగా ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. ఆర్జే హేమంత్ పోలీసు పాత్రలో కాసేపు కనిపించి మెప్పించారు. జ్ఞానేశ్వరి ఆధునిక భావాలున్న అమ్మాయిగా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. సర్కారు నౌకరిలో నటిస్తున్న భావన కూడా ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ గా మెప్పించింది. 
 
ఇక చిత్ర దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్... నేటి యూత్ ని టార్గెట్ చేసుకుని రాసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్... ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఓ రొమాంటిక్ కామెడీని బెస్ట్ కామెడీతో వెండితెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా సంభాషణలు నేటి మోడ్రన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నటీనటులను చాలా మోడ్రన్ గా చూపించారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. మెలోడి పాటలకు  సిద్ద్ శ్రీరామ్ ఆలపించడం వినసొంపుగా వుంది. చిన్నపాటి లోపాలున్నా నేటి యూత్ కు కనెక్ట్ అయ్యే చిత్రమిది.
రేటింగ్: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విఘ్నేష్ శివన్, కృతి శెట్టి కొత్త చిత్రం LIC