చిన్న పిల్లల్తో సినిమా తీసే డైరెక్టర్ విశాల్‌తో 'కథకళి'... ఎలా ఉందంటే...?
తమిళ నటుడు విశాల్ తెలుగులో పందెం కోడితో.. మాస్ ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత పలు చిత్రాలతో మరింత దగ్గరయ్యాడు. ఇంద్రుడు, వాడేవీడు.. వంటి భిన్నమైన కాన్సెప్ట్‌లతో వచ్చిన చిత్రాల్లో నటించి ప్రయోగాలు చేసే నటుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈసారి అన్
కథకళి నటీనటులు : విశాల్, కేథరిన్, మధుసూదన్ తదితరులు; కెమెరా: బాలసుబ్రహ్మణ్యం, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: హిప్ హాప్ తమిళ, నిర్మాత: విశాల్, రచన, దర్శకత్వం: పాండిరాజ్.
తమిళ నటుడు విశాల్ తెలుగులో పందెం కోడితో.. మాస్ ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత పలు చిత్రాలతో మరింత దగ్గరయ్యాడు. ఇంద్రుడు, వాడేవీడు.. వంటి భిన్నమైన కాన్సెప్ట్‌లతో వచ్చిన చిత్రాల్లో నటించి ప్రయోగాలు చేసే నటుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈసారి అన్ని భాషల్లోనూ వర్కవుట్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ పాయింట్‌తో కథకళి తీశాడు. చిన్న పిల్లల్తో సినిమాలు తీసి జాతీయస్థాయి అవార్డు పొందిన పాండిరాజ్ దర్శకత్వం చేసిన ఈ సినిమా తమిళనాడులో ఏవరేజ్‌గా నిలిచింది. కాస్త ఆలస్యమైనా తెలుగులో కథకళిగా నేడు విడుదలయింది. అదెలావుందో తెలుసుకుందాం.
కథ:
విదేశాల్లో చదువుకుని ఇండియా వస్తాడు కమల్ (విశాల్). తను ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవాలని కాకినాడ వెళతాడు. అక్కడ పల్లెకారుల సంఘం అధ్యక్షుడుగా వున్న సాంబ (మధుసూదన్) చిన్నచిన్న సెటిల్మెంట్లు చేసి పెద్దస్థాయికి ఎదుగుతాడు. ఎప్పుడో తన కుటుంబానికి అన్యాయం చేసిన సాంబను.. తన పెళ్లికి కమల్ పిలుస్తాడు. కరెక్ట్‌గా ఆ సమయంలోనే సాంబ హత్యకు గురవుతాడు. దీన్ని పరిశోధన సి.ఐ. హరిశ్చంద్రప్రసాద్ (శ్రీజిత్ రవి) టేకప్ చేస్తాడు. సరైన ఫ్రూఫ్ లేకపోవడంతో ఎవరు చేశారో అర్థంకాదు. అలాంటి సమయంలో సాంబ దగ్గర పనిచేసే అనుచరుడు.. హత్య కమల్ చేసి వుంటాడని అధికారికి ఉప్పందిస్తాడు. దాంతో కమల్‌పై పోలీసులు ఓ కన్నేసి వుంచుతారు. ఆ క్రమంలో ఓ నిజం వారికి తెలుస్తుంది? అదేమిటి? అనేది కథ.
నటనా పరంగా విశాల్ పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు. ప్రేమించిన యువకుడిగా, కుటుంబాన్ని కాపాడుకునే కొడుకుగా ఇలా మూడు షేడ్స్ బాగా డీల్ చేశాడు. ఇవి గతంలో చేసిన పాత్రలే అయినా.. కథ ప్రకారం బాగున్నాయి. ఇక కేథరిన్‌ను హీరో పాత్ర కోసమే వినియోగించారు. ఆమెకు చెప్పుకోదగ్గ పాత్ర కాదది. పోలీసు అధికారిగా శ్రీజిత్ రవి నటన బాగుంది. ఇక మిగిలిన పాత్రలన్నీ మామూలే.
టెక్నికల్‌గా..
ఇలాంటి సినిమాకు కెమెరామెన్ పనితనం చెప్పుకోవాలి. ప్రతి సీన్‌ను అద్భుతంగా తీసే ప్రయత్నం చేశాడు. తన పనితనం బాగుంది. మెరీనా బీచ్‌లో హిప్హాప్ సాంగ్‌లు పాడే తమిళ.. సంగీతం ఇవ్వడం విశేషం. విశాల్ సినిమాలకు శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు మామూలే. తన శైలిలో డైలాగ్‌లు రాశాడు. అయితే దర్శకుడిగా పాండిరాజ్.. స్క్రీన్‌ప్లే విధానం బాగుంది. రొటీన్ హత్య కథే అయినా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
విశ్లేషణ:
హీరో విదేశాల నుంచి ప్రేయసి కోసం రావడం.. ఆ తర్వాత జరిగే కథాకమామిషు.. అంతా రొటీనే. దాన్నే మొదటి భాగమంతా సాగదీశాడు. అసలు పాయింట్ సెకండాఫ్‌లో చూపించాడు. ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతోంది.. అసలు హంతకుడు ఎవరు? అనే ఉత్కంఠను కాస్త క్రియేట్ చేయగలిగాడు. పలు మర్డర్ మిస్టరీ కథలు ఇప్పటికే వచ్చేశాయి. అలాంటి కథను కొత్తగా చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తమిళంలో పర్వాలేదు అనిపించిన ఈ సినిమాను తెలుగులో పెద్దగా పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేసేశారు. దానికి కారణం.. పెద్దగా థియేటర్లు దొరక్కపోవడమే. అయినా రిలీజ్ అయిన చోట్ల బాగానే విశాల్‌కు ఓపెనింగ్స్ వచ్చాయి.
దర్శకుడుగా కొత్తదనం కోసం ట్రై చేసినా.. కథ పాతదే కావడం కాస్త మైనసే. అయినా.. థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి నచ్చుతాయి. పేరుకు కథకళి అని పెట్టినా... సంగీత నేపథ్య చిత్రం మాత్రంకాదు. మాస్ మసాలా ఫార్మెట్లో తీసిన ఈ సినిమా.. మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.