Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఇంతలో ఎన్నెన్ని వింతలో'... వెళ్లి నవ్వచ్చు.. రివ్యూ రిపోర్ట్

నటీనటులు : నందు, సౌమ్య వేణుగోపాల్‌, పూజ రామచంద్రన్‌, ఆర్‌కె. తదితరులు; సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : ఎస్‌.మురళి మోహన్‌ రెడ్డి, సంగీతం : యాజమాన్య, ఎడిటర్‌ : చోటా కె ప్రసాద్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వరప్రసాద్‌ వరికూటి, నిర్మాతలు : ఎం.శ్రీకాంత్‌ రెడ్

Advertiesment
Inthalo Ennenni Vinthalo movie Review
, శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (15:56 IST)
నటీనటులు : నందు, సౌమ్య వేణుగోపాల్‌, పూజ రామచంద్రన్‌, ఆర్‌కె. తదితరులు; సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : ఎస్‌.మురళి మోహన్‌ రెడ్డి, సంగీతం : యాజమాన్య, ఎడిటర్‌ : చోటా కె ప్రసాద్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వరప్రసాద్‌ వరికూటి, నిర్మాతలు : ఎం.శ్రీకాంత్‌ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు.
 
పలు చిత్రాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నందు హీరోగా, సౌమ్య వేణుగోపాల్‌ జంటగా నటించిన చిత్రం 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'. నూతన దర్శకుడు వరప్రసాద్‌ వరికూటి దర్శకత్వంలో శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
 
కథ:
విష్ణు (నందు), వందన (సౌమ్య వేణుగోపాల్‌) ఎఎల్‌ఎక్స్‌ కంపెనీ ఉద్యోగులు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఓ విషయంలో వందన తల్లిదండ్రులు విష్ణును తిరస్కరిస్తారు. ఆ తర్వాత ఓ సంఘటనతో వారే అంగీకరిస్తారు. అలా పెళ్ళికి ఒక్క రోజే సమయం ఉందనగా విష్ణు, స్నేహితులతో కలిసి బ్యాచిలర్స్‌ పార్టీ చేసుకుంటాడు. ఆ పార్టీలో తార (పూజ రామచంద్రన్‌) అనే అమ్మాయి కలుస్తుంది. ఆమె కారణంగా విష్ణు, అతని స్నేహితులు తెల్లారేసరికి ఒక్కొక్కరు ఒక్కో సమస్యల్లో ఇరుక్కుపోతారు. ఆ ఇబ్బందులు ఏమిటి? వాటి నుండి వాళ్లెలా బయటపడ్డారు! చివరికి పెళ్లి జరిగిందా లేదా! ముందు వద్దనుకుని మళ్ళీ ఎందుకు విష్ణును వారి మామయ్య అల్లుడిగా చేసుకుంటున్నాడనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
దర్శకుడు కొత్తవాడయినా తను తీసుకున్న అంశాన్ని తెరపై చూపించడంలో సఫలం అయ్యాడు. సన్నివేశాలపరంగా పాత్రలు ప్రవర్తించడంతో లింకు ఎక్కడా మిస్‌ కాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రతి సన్నివేశానికి ఒక ఖచ్చితమైన కారణం కనబడింది. హీరో స్నేహితుల పాత్రల ద్వారానే దర్శకుడు వరప్రసాద్‌ ఫస్టాఫ్‌, సెకండాఫ్లలో కొన్ని చోట్ల నవ్వుకోదగిన హాస్యాన్ని పండించారు.
 
నటుడిగా నందు తనేంటో నిరూపించుకున్నా కథానాయకుడిగా నిలబడాలనేది తపనతో చేసిన సినిమా ఇది. నటుడిగా ఎక్కడా హెచ్చు తగ్గులు లేకుండా సహజంగా నటించేశాడు. ఆ తర్వాత తార పాత్రలో పూజా రామచంద్రన్‌ సెంటిమెంట్‌ పండించింది. అయితే ప్రతినాయకుడిగా చక్కటి నటన కనబర్చిన గగన్‌ విహారికి భారీతనాన్ని చేకూర్చే పాత్ర. అంత బరువైన పాత్రను మోసినా కథ ప్రకారం ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది. అయితే ఈ కథాంశం పాత చిత్రాల్ని పోలివున్నా ఎక్కడా బోర్‌ కొట్టకుండా చేసే ప్రయత్నం చేశారు. 'ది హ్యాంగోవర్‌' సినిమాలోని చిన్న అంశాన్ని తీసుకున్నట్లు అనిపించినా సన్నివేశాలు కొత్తగా రాసుకుంటే బాగుండేది.  అయితే కథ రన్నింగ్‌ సన్నివేశాలు టకటకా వచ్చేయడం బాగున్నా వాటిని ఇంకాస్త బలంగా వుండేలా జాగ్రత్త పడేది సరిపోయేది. 
 
యాజమాన్య అందించిన సంగీతం పర్వాలేదు. ఎస్‌.మురళి మోహన్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ జస్ట్‌ ఓకె అనేలా మాత్రమే ఉండగా చోటా కె ప్రసాద్‌ ఎడిటింగ్‌ బాగానే ఉంది. చిత్ర నిర్మాతలు ఎం.శ్రీకాంత్‌ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావులు పాటించిన నిర్మాణ విలువలు  బాగున్నాయి. కథలో అడుగడుగునా వింతలున్నట్లుగా చూపించిన ఈ  చిత్రాన్ని తననుకున్న రూటులో చెప్పే ప్రయత్నం చేశాడు. హాస్యంతోపాటు సెంటిమెంట్‌ టెన్షన్‌ను క్రియేట్‌ చేసిన ఈ సినిమా దర్శకుడికి మొదటి మెట్టు ఎక్కినట్లే. నందు, పూజా, గగన్‌ విహరికి ఈ చిత్రం మరింత ఉపయోగపడుతుంది. పరిమిత బడ్జెట్‌లో మూస ధోరణితో వచ్చే చిత్రాల తరహాలో కాకుండా మంచి ప్రయత్నం చేశారనే చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌తో నాలుగేళ్ళు కాపురం చేసేటపుడు తెలియలేదా? తమ్మారెడ్డి భరద్వాజ్ (Video)