Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజుగారి కోడిపులావ్ రుచి ఎలావుందంటే - రివ్యూ

kodi palavu
, శుక్రవారం, 4 ఆగస్టు 2023 (15:51 IST)
kodi palavu
నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు
సాంకేతికత: నిర్మాణ సంస్థలు : సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు, సంగీతం : ప్రవీణ్ మని, ఎడిటర్ : బసవా- శివ కోన, నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన, దర్శకత్వం : శివ కోన
 
కథ: 
రాజుగారు (ప్రభాకర్) అటవీ ప్రాంతంలో గల ఓ గ్రామంలో  కోడిపులావ్ వండటంలో ఫేమస్. కానీ ఇంటిని ఆయన  భార్య పట్టించుకోదు. మరోవైపు  తనకు  ఆడపిల్ల పుట్టిందని రాజు గారికి అసంతృప్తి. దానితో తాగుడుకు బానిస అవుతాడు. ఓ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో ఇంటికే పరిమితం అవుతాడు. ఇక  కొన్నేళ్ల తర్వాత మూడు జంటలు  డ్యాని(శివ కోన), క్యాండీ (ప్రాచి కెథర్), బద్రి(కునాల్‌ కౌశిక్‌), ఆకాంక్ష(నేహాదేష్‌ పాండే), షారుఖ్‌(అభిలాష్‌ బండారి) ఈషా(రమ్య దినేష్‌) రోడ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తారు. వీరిలో క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ కాలేజీ స్నేహితులు. 
 
కారులో జర్నీ చేస్తుండగా కారు పాడవుతుంది. దాంతో అడవిలో మ్యాప్ ఆధారంగా నడవాల్సి వస్తుంది. అలా ప్రయాణం సాగిస్తుండగా గమ్యం చేరకుండానే ఒక్కొక్కరుగా ముగ్గురు మరణిస్తుంటారు. ఫైనల్ గా ముగ్గురు మిగులుతారు. ఆ తర్వాత ఏమైంది. అసలు రాజుగారికి ఈ మూడు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
సమీక్ష 
ఇందులో ముగ్గురు జంటల ప్రేమికులు, ఒకరికొకరు తెలుసు. సరదాగ ట్రిప్ ఎంజాయ్ చేసేవిధంగా ఉంటుంది. దర్శకుడు అందుకే ఇప్పటి యూత్ ఆరోచనలను చూపించాడు. ఫ్రెండ్ తన భార్యను సరిగ్గా పట్టించుకోకపోతే మరో ఫ్రెండ్ ఆమెతో ఎంజాయ్ చేయడం.  వంటి సన్నివేశాలు పుక్షలంగా ఉన్నాయి. రాజుగారి కోడిపులావ్‌ హోటల్‌ కు ఈ జంటకు లింక్ ట్విస్ట్ చివర్లో ఉంటుంది.  దాన్ని జాగ్రత్తగా డీల్ చేసాడు. ఆ క్రమంలో సన్నివేశాల పరంగా చాలా ఫ్రీడమ్ తీసుకున్నారు. ఓ దశలో హాలీవుడ్ ఫార్మేట్  కనిపిస్తుంది.
 
ఇందులో ముగ్గురు మూడు రంగాల్లో ఉండడంతో పాటు గైనకాలజిస్ట్ చలాకీగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అమ్మయి అడవిలో ఉన్నా  క్లయింట్ మీటింగ్ అంటూ ఆమె చేసే పనులు ఎంటర్టైన్మెంట్ తెపిస్తాయి. అడవిలో ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు కనపడడం తో సస్పెన్స్ క్రియేట్ చేసాడు దర్శకుడు. కానీ చివర్లో ఆ ముడి విప్పడానికి నరేషన్ చాలా లెంగ్త్ తీసుకున్నాడు.  అందుకే ఓ దశలో బోర్ కొడుతోంది. 
 
ఇక సెకండాఫ్‌లో ముగింపు వరకు ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయో ముడి విప్పడంలో చిన్నపాటి సందేశం చెప్పాడు.  పిల్లలను తల్లి తండ్రులు జాగ్రత్తగా పెంచాలి. హద్దు దాటితే వారు పెద్దయ్యాక మైండ్లో ఎటువంటి విషబీజాలు నాటుకుంటాయో చెప్పే ప్రయత్నం బాగుంది. కానీ ఆ దశలో శృతిమించిన సన్నివేశాలు రాసుకున్నాడు. 
 
ఇందులో అందరూ బాగా నటించారు. శివ కోన నటనలో కొన్ని షేడ్స్ చూపించాడు.  అయితే తన వాయిస్ శర్వానంద్ ను గుర్తుచేస్తుంది. దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పటికీ నటన పరంగా ఎక్కడా తగ్గలేదు. ఇక  ప్రాచీ థాకర్ జీవించేసింది.యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. 
 
ఇటువంటి సినిమాకు కెమెరా, సంగీతం కీలకం. వాటి పనులు బాగానే చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా చూపించాడు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. క్లైమాక్స్ లో ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ పరంగా  సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. రాజుగారి పాత్రలో ప్రభాకర్ ది పరిమితమే. అయితే ఆయన భార్య పాత్ర లో బోల్డ్ నెస్ నాటుగా చూపించారు. కానీ  దాన్ని పోలిష్గా చూపిస్తే బాగుండేది. ఇది యూత్ కోసం తీసినట్లుంది. ప్రేక్షకులను బట్టి  ఈ సినిమా ఆదరణ ఉంటుంది. 
రేటింగ్: 2.25/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో 'నాని'