Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్థం లేని సత్యరాజ్ 'దొర' ... సూర్య నటించిన 'రాక్షసుడు'కి ఏమాత్రం తీసిపోదు!

డబ్బింగ్‌ సినిమాలంటే ఏదో ప్రత్యేకత ఉంటుందని.. ఆసక్తి తెలుగు ప్రేక్షకులకు ఉంది. ఇటీవలే విడుదలైన "బిచ్చగాడు" సినిమా అందుకు నిదర్శనం. కానీ అన్ని అలాంటి సినిమాలు ఉండాలనే రూలు లేదు. కానీ ఏదో కొత్తగా చూపిస్

అర్థం లేని సత్యరాజ్ 'దొర' ... సూర్య నటించిన 'రాక్షసుడు'కి ఏమాత్రం తీసిపోదు!
, శుక్రవారం, 1 జులై 2016 (13:24 IST)
నటీనటులు:
సిబి సత్యరాజ్‌, సత్యరాజ్‌, బిందుమాధవి తదితరులు
నిర్మాత: జక్కం జవహర్‌బాబు, దర్శకత్వం: ధరణి ధరన్‌ 
రత్న సెల్యులాయిడ్‌
 
డబ్బింగ్‌ సినిమాలంటే ఏదో ప్రత్యేకత ఉంటుందని.. ఆసక్తి తెలుగు ప్రేక్షకులకు ఉంది. ఇటీవలే విడుదలైన "బిచ్చగాడు" సినిమా అందుకు నిదర్శనం. కానీ అన్ని అలాంటి సినిమాలు ఉండాలనే రూలు లేదు. కానీ ఏదో కొత్తగా చూపిస్తారనే ఆసక్తి మాత్రం ఉంటుంది. బాహుబలి.. తర్వాత సత్యరాజ్‌ తమిళంలో చేసిన 'జాక్సన్‌ దొరై' చిత్రాన్ని తెలుగులో 'దొర'గా తీసుకువచ్చారు. రెండుచోట్ల శుక్రవారమే విడుదలైంది. ఇప్పటివరకు 'బాహుబలి' కట్టప్పగా పిలుస్తున్నారు. దొర సినిమా తర్వాత దొరగా పిలుస్తారనే స్టేట్‌మెంట్‌ కూడా సత్యరాజ్‌ హైదరాబాద్‌ వచ్చి మరీ ఇచ్చాడు. మరి తను చెప్పింది కరెక్టా కాదా? చూద్దాం.
 
కథ:
సిటీలో ఓ స్టేషన్‌లో ఎస్‌ఐగా జాయిన్‌ అయిన సిబి సత్యరాజ్‌కు ఫోజులెక్కువ. సెలవుపెట్టి మరీ తనకుకాబోయే అమ్మాయి కోసం వెతుకూవుంటాడు. ఓసారి పైఅధికారి.. అతనికి ఓ పని అప్పగిస్తాడు. గుంటూరు జిల్లాకు దూరంగా దొరపురం అనే ఊరిలో రాత్రి 9 గంటలు దాటితే దీపాలు ఆర్పేసి నిద్రపోతారు. బయటకు రారు. అక్కడో జాక్సన్‌ అనే ఆత్మ తిరిగి అందరినీ భయపెడుతుందని ఫిర్యాదు వస్తే.. సిబిని వెళ్ళి అదేమిటో కనుక్కొని రమ్మని పైఅధికారి చెబుతాడు. అలా తను ఆ ఊరి వచ్చి అక్కడ బ్రిటీష్‌కాలంలో ఉన్న దొర ఇంటిపై నిఘా పెడతాడు. ఆ ఊరి పెద్ద ఇతనికి తగిన సాయం చేస్తాడు. 
 
అయితే ఈ దశలో ఊరిపెద్ద కుమార్తె బింధుమాధవి ప్రేమలో సిబి పడతాడు. సిబికి పోటీగా మామయ్య ఒకాయన వస్తాడు. తన కుమార్తెను చేసుకోవాలంటే.. దొరబంగళాలో ఏడురోజులు ఉండి ఎవరైతే తిరిగి వస్తారో వారికిచ్చి వివాహం చేస్తానంటాడు ఆమె తండ్రి. అలా ఇద్దరు వెళ్ళి అక్కడ ఉంటారు. ఏడు రోజుల్లో వారికెదురైన అనుభవాలే సినిమా.
 
విశ్లేషణ:
సినిమా ఆరంభమే చంద్రముఖి.. చంద్రకళ తరహాలో ఎత్తుగడ వుంటుంది. చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన మొదటి పార్ట్‌.. సెకండాఫ్‌లోకి వచ్చేసరికి గాడి తప్పింది. ఎక్కడా పొత్తనలేని కథలో సాగదీశాడు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ ఆఫీసర్‌ జాక్సన్‌ పాలించిన గ్రామం అది. అక్కడ తన ఇష్టానుసారంగా. ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తాడు. ఎదిరిస్తే చంపేస్తాడు. అలాంటి చోట అడవుల్లో ఉండే దొర సత్యరాజ్‌ తిరుగుబాటు చేస్తాడు. అందుకోసం దొర కుమార్తెను కూడా చంపేసి.. చివరికి అందరినీ తుదముట్టిస్తాడు జాక్సన్‌. చనిపోతూ.. వచ్చేజన్మలో నీ అంతు చూస్తానంటూ దొర కాలంచేస్తాడు. ఆ తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో జాక్సన్‌తోసహా అక్కడ ఉన్నవారందరూ కాలిపోతారు. వారే మళ్ళీ ఆత్మలుగా అక్కడే వుంటూ.. రాత్రికి వచ్చి పగలు మాయం అవుతుంటారు. 
 
రాత్రి దొరతోపాటు అని అనుచరులు రావడం.. ఆంగ్ల దొరతో పోరాటం చేయడం.. ఆయన కాల్పులు జరపడం.. చనిపోవడం.. ఇలా ఏడురోజులు.. హీరోకు ఎదురైన అనుభవమే.. అలా ఎందుకువస్తారో. అర్థంకాదు.. చనిపోయేముందు.. జాతీయజెండాల.. ఆ భవంనపై ఎగరాలి.. దానికోసం.. ఇలా ఆత్మలు ఒకరిపై ఒకరు పోరాటాలు చేసుకోవడం.... చూసేవారికి ఏమీ అర్థంకాదు. సరిగ్గా ఇలాంటి కథతో అటూఇటూగా.. సూర్య నటించిన 'రాక్షసుడు' వచ్చింది. ఆ కాన్సెప్ట్‌ కూడా తీరని కోరికలతో చనిపోయి.. అవి తీరడానికి.. ఇలా ఆత్మలుగా వచ్చి.. రెండో సూర్యకు హెల్ప్‌ చేస్తాయి. అయితే.. అది తెలుగులో పెద్ద డిజాస్టర్‌.. ఇప్పుడు ఇది దొర కూడా దాదాపు అంతే.. కథేమిటో.. చివరి వరకు అర్థంకాదు. 
 
మధ్యమధ్యలో.. హీరో హీరోయిన్ల లవ్‌ట్రాప్‌ రొటీన్‌గా ఉంది. ఏమాత్రం ఆ సక్తికరంగా లేదు. దెయ్యాల సినిమాలంటే భయపెట్టడడం, ఎంటరటైన్‌ చేయడం రూలు.. ఇక్కడ అదేమీలేదు. సెకండాఫ్‌లో తీసుకున్న విధానం ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. పెద్దగా ఓపెనింగ్స్‌లేని ఈ సినిమా.. ఎంతమేరకు నిలుస్తుందో చూడాలి.
 
పెర్‌ఫార్మెన్స్‌..
సత్యరాజ్‌.. స్వాతంత్ర్యం కోసం తెల్లవారిపై పోరాడే పాత్రను.. చనిపోయాక ఆత్మగా వచ్చే పాత్రను పోషించాడు. అయితే. రెండో పాత్రలో ఎటువంటి ఫీలింగ్‌ కన్పించదు. సిబి.. తన తండ్రి యంగ్‌లో ఉన్నట్లు కన్పించాడు. నటన పెద్దగా చెప్పుకోడానికి లేదు. బింధుమాధవి పాత్ర కూడా అలాగే వుంది. 
 
సాంకేతికంగా..
దెయ్యాలు సినిమా కనుక.. సినిమాటోగ్రఫీ కీలకం. రాత్రి పూట వచ్చే సన్నివేశాలను తన కెమెరాతో ఆకట్టుకున్నాడు. గ్రాఫిక్స్‌ పర్వాలేదు. మిగతా డిపార్ట్‌మెంట్లు సోసోగా వున్నాయి. 
 
రేటింగ్‌:.. 1.5/5 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ సింగర్ జాఫ్రీ అటాక్ తరహాలో నదీమ్‌పై దుండగుల కాల్పులు.. ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ?!