ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా లో దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సీనియర్ నటీనటులు ఉన్నారు. మే 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలావుందో చూద్దాం.
అలా మొదలైంది తర్వాత ఓ బేబీ సినిమా హిట్‌తోనే తన ఖాతాలో వేసుకున్న దర్శకురాలు నందినీ రెడ్డి ఈసారి కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైన్ మెంట్ ప్రేమికుల లవ్ నేపథ్యంలో అన్నీ మంచి శకునములే చిత్రానికి దర్శకత్వం వహించారు. సి. అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న నిర్మాతలు. ఈరోజే విడుదలైన ఈ సినిమాలో చివరి 20 నిముషాలనే ది బెస్ట్ నా కెరీర్‌లో ఇచ్చానని చెప్పిన దర్శకురాలు ఈ సినిమా ఎలా తీసిందో చూద్దాం.
కథ:
ఆంధ్ర, తమిళ్ నాడు బోర్డర్‌లోనిది విక్టోరియా పురం. స్వాతంత్రానికి ముందు బ్రిటీష్‌రాణి అక్కడ కాఫీ ఎస్టేట్ నుంచి వచ్చిన కాఫీ పొడితో కాఫీ తాగి ఆనందించేది. అప్పటి చెఫ్ బాగా తయారుచేసేవాడు. ఇక ప్రస్తుతానికి వస్తే, అప్పటినుంచి ఆ చెఫ్‌తోపాటు వుండే మరో స్నేహితునికి కాఫీ ఎస్టేట్‌లో వాటాల గురించి ఆస్తిపంపకాలగురించి గొడవలు జరిగేవి. అవి నాలుగు తరాలుగా కోర్టుల చుట్టూ నడుస్తూనేవున్నాయి. ప్రస్తుతం వారి వారసులు రావురమేష్, రాజేంద్రప్రసాద్. వారికి ఓ అబ్బాయి, ఓ అమ్మాయి సంతానం. వారే సంతోష్ శోభన్, మాళవిక నాయర్. ఇప్పటి తరానికి పంతాలు, పంట్టింపులు కోర్టు కేసులు నచ్చవు. కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పినా ఆ ఇద్దరుస్నేహితులు మంకుపడతారు. ఈ క్రమంలో వారిద్దరి పిల్లలు పెరిగి యుక్తవయసుకు వస్తారు. వారిద్దరిలో వారసత్వంగా వచ్చిన కాఫీ వ్యాపారాన్ని దేశదేశాల్లో డెవలప్ చేయాలని మాళవిక ప్రాజెక్ట్ తయారుచేస్తుంది. అందుకు మాళికకు తోడుగా సంతోష్ కూడా యూరప్ వెళతాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ గొడవ పడతారు. సంతోష్ అక్కడే యూట్యూబ్‌లో ఫుడ్ వీడియోలు చేసి సంపాదిస్తాడు. కానీ తన తండ్రి కోర్టుకేసులో అరెస్ట్ అవుతున్నాడని తెలిసి తిరిగి ఇండియా వస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు సంతోష్, మాళవిక ఎలా కలిశారు? ఎందుకు గొడవపడ్డారు? ఇక వీరిద్దరు ఎవరు ఎవరికి పుట్టిన పిల్లలు అనే సీక్రెట్స్ వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
రొటీన్ కథ కాకపోయినా ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు కొత్తగా కథను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు. మొదటి భాగం చాలా సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగుతుంది. హీరో హీరోయిన్లపై సాగే సన్నివేశాలకు తోడు, వెన్నెల కిశోర్ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఫన్ తెప్పిస్తుంది. కుటుంబంలో ఇలాంటివాడూ ఒకడు వుంటాడని అనిపిస్తుంది. ఇలా ప్రతీ పాత్రా మన కుటుంబంలోని ఎవరో ఒక్కరినీ టచ్ చేస్తాయి. అయితే ఈ కథలో విలన్లు ఎవరూ వుండదు. మనిషిలోని మంకుపట్టు, ఇగోలే కథను నడుపుతాయి. చివరికి ఎలా ముగింపు అనేది తెలిసిందే.
నటనా పరంగా హీరో హీరోయిన్లు బాగానే చేశారు. సీనియర్ నటీమణులు షావుకారు జానకీ, వాసుకి, అంజు, గౌతమి వంటి నటీమణులను ఒకే కుటుంబంలో చూసినట్లుంటుంది. రావురమేష్ బ్రదర్‌గా సీనియర్ నరేశ్ చేశాడు. ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.
ఇక టెక్నికల్‌గా మిక్కీ జె. మేకర్ సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్‌తోపాటు ఓ యుగళ గీతానికి సంగీతం ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బీజియమ్స్ కొత్తగా లేకపోయినా సన్నివేశానికి తగిన మూడ్‌ను క్రియేట్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. విక్టోరియా పురం అనే ఊరును కునూర్‌లో అందరమైన కాఫీ తోటల ప్రాంతంలో తీశారు.
మొత్తంగా ఫీల్ గుడ్ సినిమా చూపించాలని దర్శక నిర్మాతలు చేసిన ప్రయత్నం అభినందనీయం. అందుకు తగినట్లుగానే కథ, కథనం వుంది. పాత్రలూ వున్నాయి. కానీ నెరేషన్ మొదటి భాగం చాలా స్లోగా సాగడంతో సెకండాఫ్ ఎలా వుంటుందనే అనుమానమూ కలుగుతుంది. అయితే సెకండాఫ్‌లో షడెన్‌గా రావురమేష్ యూరప్ ఎందుకు వస్తాడో తెలీదు. హీరో స్నేహితుడు కూడా షడెన్‌గా అక్కడ ప్రత్యక్షమయి హీరోకు తోడుగా వుంటాడు. ముగింపులోనూ హీరోకు తనపై ఎంత ప్రేమిందో తెలిసేలా మాళవికకు గౌతమిద్వారా ఓ సీన్ క్రియేట్ చేశారు. అది లాజిక్‌గా వున్నా, ఎందుకు హీరోను వ్యతిరేకిస్తుంది అనే దానిలో స్ట్రాంగ్ రీజన్ లేదు.
ఇక ఈ సినిమా చూస్తే, అలవైకుంఠపురంలో చిత్రం ఛాయలు కనిపిస్తాయి. మరోవైపు కాంతార లోని ఓ చిన్న బిట్ కూడా కనిపిస్తుంది. యాదృశ్చికం అనడానికి అవకాశంలేదు. ఎందుకంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక ఈ సినిమా రావడమే కారణం. ఇక టైటిల్ కూడా ఎందుకు అంత పెట్టారో అర్థం కాదు. ఏది ఏమైనా చక్కటి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. కుటుంబంతో సహా చూడాల్సిన సినిమా. దాన్ని ఏ మేరకు ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాల్సిందే.