Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

తూటా రివ్యూ.. ప్రేక్షకులకు పజిల్‌లా మారిన గౌతమ్‌మీనన్‌ మూవీ

Advertiesment
Dhanush
, బుధవారం, 1 జనవరి 2020 (17:23 IST)
నటీనటులు : ధనుష్‌, మేఘా ఆకాష్‌, సునైనా, శశి కుమార్‌, సెంథిల్‌ వీర స్వామి.
సంగీతం :  దర్బుక శివ, 
నిర్మాతలు : జి.రామకృష్ణా రెడ్డి, తాతా రెడ్డి, 
దర్శకత్వం : గౌతమ్‌ మీనన్‌
సినిమాటోగ్రఫర్‌ : జామూన్‌ టి జాన్‌, మనోజ్‌ పరమహంస, ఎస్‌ ఆర్‌, కథిర్‌, ఎడిటర్‌:  ప్రవీణ్‌ ఆంటోని.
 
గౌతమ్‌ మీనన్‌ వాసుదేవ్‌ చిత్రాలన్నీ రొమాంటిక్‌ ప్రేమతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలాంటి కాన్సెప్ట్‌తోపాటు కాస్త యాక్షన్‌ కూడా మేళవించిన సినిమా 'తూటా'. ధనుష్‌, మేఘ ఆకాష్‌ జంటగా నటించారు. కొత్త సంవత్సరం నాడే మూవీ విడులైంది. ఈ తూటా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
రఘు (ధనుష్‌) బి.టెక్‌ విద్యార్థి. కాలేజ్‌లో సినిమా చిత్రీకరణ కోసం వచ్చిన హీరోయిన్‌ లేఖ (మేఘా ఆకాష్‌)ను తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. లేఖ ఓ అనాధ. తనను పెంచి పెద్ద చేసిన సేతు వీరస్వామి మంచివాడు కాదు. ఆమెను బలవంతంగా సినిమాలలో నటించేలా చేస్తాడు. రఘు నచ్చడంతో తనింటికి వెళ్ళిపోతుంది లేఖ. నాలుగేళ్ళ తరువాత ముంబైలో ఆపదలో ఉన్న లేఖను రఘు అన్నయ్య గురు (శశి కుమార్‌) కాపాడతాడు. లేఖ ఎందుకు ముంబై వచ్చింది. రఘుతో కలిసి వుండాలని ఇంటికి వచ్చిన ఆమె ఏమయింది? వీరస్వామి ఏమయ్యాడు? రఘు ప్రేమ ఏమయింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఇందులో ధనుష్‌, మేఘా ఆకాష్‌ల నటన సహజంగా వుంది. ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఉన్న ప్రేమికులుగా జీవించారు. వారిద్దరి మధ్య నడిచే రొమాన్స్‌, కెమిస్ట్రీ సీరియస్‌గా సాగే కథలో ప్రేక్షకుడికి కొంచెం ఉపశమనం కలిగేలా చేస్తుంది. అలాగే యాక్షన్‌లో ధనుష్‌ ఆకట్టుకొనేలా సాగింది. 
 
ఒంటిచేత్తో ధనుష్‌ సినిమాను నడిపాడు. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, ఉత్కంఠ రేపే సీన్స్‌ నందు ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రధాన విలన్‌ రోల్‌ చేసిన సేతు వీరస్వామి నటన పాత్రకు తగ్గట్టుగా వాస్తవానికి దగ్గరా సాగింది. ధనుష్‌ ఫ్రెండ్‌గా చేసిన సునైన తన పాత్ర పరిధిలో ఆకట్టుకుంది. 
 
ఇక గౌతమ్‌ చిత్రాలంటే కాస్త నెరేషన్‌ స్లోగా సాగుతుంది. ద్వితీయార్థంలో అది కన్పించింది. కానీ క్లైమాక్స్‌ చాలా సింపుల్‌గా తేల్చిపారేశారు. నేపథ్యంతో పాటు సాగే పాటలు అలరిస్తాయి. ముఖ్యంగా సిద్‌ శ్రీరామ్‌ పాడిన రెండు పాటలు చాలా బాగున్నాయి. బీజీఎమ్‌ కూడా సన్నివేశాలకు తీవ్రతను జోడించింది.
webdunia
 
ఇలాంటి కథలు పలు వచ్చేశాయి కూడా. హీరోయిన్‌స్థాయి అమ్మాయి సింపుల్‌గా ఓ కాలేజీ కుర్రాడి ప్రేమలో పడిపోవడం.. యాదృశ్చికంగా వుంది. ఎప్పుడో ఇంటి నుండి పారిపోయిన రఘు అన్నయ్య ముంబైలో ఆపదలో ఉన్న హీరోయిన్‌ కాపాడటం వంటివి సినిమాలిక్‌గా అనిపిస్తాయి. క్లిష్టమైన కథకు అంతకన్నా ఆసక్తిలా స్క్రీన్‌ప్లే రాసుకుంటే బాగుండేది. చాలావరకు ప్రేక్షకులకు పజిల్‌లా అనిపిస్తుంది. పెద్దగా ట్విస్ట్‌లు కూడా ఏమీ లేవు.
 
ఈ నేపథ్యంలో సాగే దర్బుక శివ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ప్రవీణ్‌ ఆంటోని ఎడిటింగ్‌ పరవాలేదు. యాక్షన్‌ థ్రిల్లర్స్‌కి సుదీర్ఘమైన నిడివి కంటే కూడా క్రిస్పీగా ఉంటే నిడివి ఆకట్టుకుంటుంది. 
 
సినిమాటోగ్రఫీ బాగుంది. గౌతమ్‌ మీనన్‌ మేకింగ్‌లో గత సినిమాలను పోలివుండటం బలహీనతగా మారుతుంది. వినోదానికి తావు లేకుండా సీరియస్‌గా సాగిన ఈ చిత్రం హాలీవుడ్‌ స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌లా అనిపించినా పెద్దగా ఉపయోగం లేదు. 
 
వాస్తవానికి దూరంగా ఆయన ఎంచుకున్న క్లిష్టమైన కథను ఇంకా క్లిస్టమైన స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేశారు. క్రైమ్‌, థ్రిల్లర్స్‌ చూసేవారికి నచ్చుతుంది. ఇది ఎంత మేర సక్సెస్‌ అవుతుందో వేచిచూడాల్సిందే.
 
రేటింగ్‌..2.75/5 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేజీఎఫ్ ఛాప్టర్ 2- జ‌న‌వ‌రి 8న ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌