Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#BossIsBackfestival : 'కత్తి' శీనుతో "ఖైదీ నంబర్ 150" స్టార్ట్... డ్యాన్సుల్లో అదే దూకుడు

డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలో ఉర్రూతలూగించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" బుధవారం భారీ అంచనాల మధ్య విడుదల

Advertiesment
khaidi no 150 review
, బుధవారం, 11 జనవరి 2017 (05:33 IST)
డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలో ఉర్రూతలూగించి కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" బుధవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షోలను బుధవారం వేకువజామునుంచే ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్ర కథను పరిశీలిస్తే... 
 
చిత్రం పేరు: ఖైదీ నంబర్‌ 150
నటీనటులు: చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌ లక్ష్మి, తరుణ్‌ అరోరా, బ్రహ్మనందం, సునీల్‌, అలీ వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు. 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
దుస్తులు ‌: కొణిదెల సుస్మిత 
ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు 
మాటలు: పరుచూరి బ్రదర్స్‌ 
నిర్మాతలు: రామ్‌చరణ్‌ 
దర్శకత్వం: వి.వి.వినాయక్‌ 
విడుదల తేది: 11.01.2017
 
2004లో సిరీ కెరీర్‌కు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా, కాంగ్రెస్ రాజ్యసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కొనసాగిన చిరంజీవి.. ఆ తర్వాత 9 యేళ్ళ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ పేరుత వెండితెరపై కనిపిస్తున్నారు. తన తనయుడు, హీరో రామ్‌చరణ్‌ నిర్మాతగా అందిస్తోన్న తొలి సినిమా ఇది. అన్నింటికంటే మించి ఇది 'అన్నయ్య' 150వ సినిమా.... సంక్రాంతి బరిలో ముందొచ్చిన చిత్రం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా... తమిళ చిత్రం 'కత్తి'కి రీమేక్‌గా మన ముందుకొచ్చింది.
 
ఈ చిత్ర కథను పరిశీలిస్తే... కోల్‌కతా సెంట్రల్‌జైల్‌లో కత్తి శీను (దొంగ పాత్రలో చిరంజీవి) కనిపించడంతో కథ మొదలవుతుంది. కటకటాల వెనకనున్న కత్తిశీను అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కి వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లిపోయే సమయంలో హీరోయిన్‌ కాజల్‌ని చూస్తాడు. ప్రేమలో పడతాడు. దిల్‌కా దడ్కన్‌ కోసం విదేశం వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తాడు. ఆ సమయంలోనే ఓ వ్యక్తిని హత్య చేయబోవడాన్ని చూస్తాడు. అప్పుడే అచ్చం తనలాగే ఉన్న వ్యక్తి శీను కంటపడతాడు. అతడే శంకర్‌ (చిరంజీవి ద్విపాత్రాభినయం). 
 
తనలాగే ఉన్న శంకర్‌ని పోలీసులు దొంగ అనుకునేలా చేసి, వాళ్లకు పట్టిస్తాడు కత్తిశీను. ఓ పక్క ప్రేమ, మరోపక్క చకచకా సాగే మాస్‌ సన్నివేశాలతో ప్రథమార్థం సాగుతుంది. చిరంజీవి ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటారు. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే 'రత్తాలూ...'. 'సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు కుర్రకారుని హుషారెక్కిస్తాయి. 
 
లుక్‌ పరంగా చిరంజీవి... ఒకప్పటిలానే కనిపించి 'ఆహా పదేళ్ల తర్వాత కూడా అదే ఫిజిక్‌తో కనిపిస్తున్నారే' అని ఆశ్చర్యపోయేలా చేస్తారు. డ్యాన్సుల పరంగానూ ఒకప్పటి స్పీడే ఇప్పుడూ కనిపిస్తుంది. అరెస్ట్‌ అయిన శంకర్‌ నేపథ్యం ఏమిటి... కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుంది.... చిత్ర మిగిలిన కథ ఏంటి అనేది వెండితెరపై చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ షో స్టార్ట్.... 'ఖైదీ నెంబర్‌ 150' ప్రత్యేక ప్రదర్శన ప్రారంభం.. టాకేంటి?