Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్క మహిళతో బాబుకు బాడీ బ్లాంక్ అవుతుంది.. విచ్చలవిడి BBB రివ్యూ రిపోర్ట్

శ్రీనివాస్ అవసరాల ప్లేబాయ్ యాక్టింగ్ అదిరిపోయింది. అతని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా కోసం ఎంచుకున్న నేపథ్యం బాగుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే స్టోరీ లైన్ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. పోసాని కృ

ఒక్క మహిళతో బాబుకు బాడీ బ్లాంక్ అవుతుంది.. విచ్చలవిడి BBB రివ్యూ రిపోర్ట్
, శుక్రవారం, 5 మే 2017 (15:03 IST)
సినిమా పేరు : బాబు బాగా బిజీ 
నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, మిస్తి చక్రబర్తి, తేజశ్వి మదివాడ తదితరులు
దర్శకత్వం : నవీన్ మేడారం
నిర్మాత : అభిషేక్ నామ
సంగీతం : సునీల్ కశ్యప్
విడుదల తేదీ : మే 5, 2017
రేటింగ్ : 2.25/5
 
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి2 రికార్డులు, కలెక్షన్ల పరంగా కుమ్మేస్తుంటే.. జక్కన్న సినిమాతో పోటీపడేందుకు శ్రీనివాస్ అవసరాల సినిమా బాబు బాగా బిజీ శుక్రవారం (మే 5న) విడుదలైంది. కొత్త దర్శకుడు మేడారం దర్శకత్వంలో రూపుదిద్దుకుని.. శ్రీనివాస్ అవసరాల టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ సినిమా హిందీ హంటర్‌కు రీమేక్‌గా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అడల్ట్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.. 
 
కథ :
మాధవ్ (శ్రీనివాస్ అవసరాల) స్కూల్ స్టేజీ నుంచి ఆడవాళ్లంటే పడిచస్తాడు. అమ్మాయిల పట్ల, శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తాడు. చెడుదారిన పడతాడు. స్కూల్ బాయ్ నుంచే ప్లే బాయ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తాడు. ఇలా అనేక అమ్మాయిలతో సంబంధాలు కలిగివుంటాడు. ఇలా ఓ మహిళ ద్వారా ఎదురైన ఇబ్బందితో.. ఇక ఇలాంటి చెడు అలవాట్లను మూటగట్టి.. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలా పెళ్లి చూపుల ద్వారా రాధ (మిస్తి చక్రబర్తి)ని కలిసి, తన గతం గురించి ఆమె దగ్గర దాచి ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలా మాధవ్ రాధను పెళ్లి చేసుకుంటాడా..? చెడు తిరుగుళ్లు మానేసి మంచివాడవుతాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ప్లస్ పాయింట్స్ : 
శ్రీనివాస్ అవసరాల ప్లేబాయ్ యాక్టింగ్ అదిరిపోయింది. అతని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా కోసం ఎంచుకున్న నేపథ్యం  బాగుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే స్టోరీ లైన్ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. పోసాని కృష్ణ మురళీ పోలీస్‌గా కామెడీ పండించాడు. చెడు అలవాట్లకు దూరం కావాలని, హీరోయిన్‌కు దగ్గరవ్వాలని మాధవ్ చేసే ప్రయత్నాలు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా చక్కగా కుదిరింది. రియలిస్టిక్ లొకేషన్లలో ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపారు.
 
మైనస్ పాయింట్స్ :
ఎంటర్‌టైన్‌మెంట్ లోపించింది. 
రొటీన్ సినిమాగా కనిపించింది. 
పోసాని తప్ప కామెడీ పండలేదు. 
ప్రేక్షకుడికి సీన్స్ ఏవీ కనెక్ట్ కాలేదు. 
క్లైమాక్స్ చాలా సాదాసీదాగా, రొటీన్ గానే మిగిలిపోయింది. 
సాంకేతిక అంశాలు లోపించాయి. 
సినిమాటోగ్రాఫీ బాగున్నా.. నవీన్ మేడారం హోమ్ వర్క్ కొరవడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెట్స్‌లో అందాలు ఆరబోసిన సన్నీ లియోన్.... కెమేరా చేతబట్టి సభ్యులను హీటెక్కించింది...