'అప్పట్లో ఒకడుండేవాడు' ఎక్కడో చూసినట్లుందే... రివ్యూ రిపోర్ట్
'అప్పట్లో ఒకడుండేవాడు' ఎక్కడో చూసినట్లుందే... రివ్యూ రిపోర్ట్
అప్పట్లో ఒకడుండేవాడు నటీనటులు : నారా రోహిత్, తాన్య హోప్, శ్రీ విష్ణు తదితరులు, సంగీతం : సాయి కార్తీక్, నిర్మాత : ప్రశాంతి, కష్ణ విజయ్, దర్శకత్వం : సాగర్ కె చంద్.
విడుదల తేదీ : డిసెంబర్ 30, 2016
'బాణం' తర్వాత నారా రోహిత్ నుంచి అంత సీరియస్ రోల్ రాలేదని చాలామంది అడుగుతుండేవారు. అవకాశం కోసం చూస్తున్నానంటూ.. ఆయన ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేశాడు. శుక్రవారం విడుదలైన ఆ సినిమా 'అప్పట్లో ఒకడుండేవాడు'. ఇందులో శ్రీవిష్ణు మరొక నటుడ్ని తీసుకుని చేశాడు. అంతకుముందు ఒక సినిమా అనుభవమున్న సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి అది ఎలా వుందో చూద్దాం.
కథ:
రైల్వే కాలనీలో వుంటూ గొప్ప క్రికెటర్ అవ్వాలనే రాజు ఉరఫ్ రైల్వేరాజు (శ్రీవిష్ణు) కృషితో మంచి ఫాంలోకి వస్తాడు. భారత్ తరపున ఫైనల్ సెలక్షన్‌కు ఎంపిక చేసే టైమ్‌లో అతనిపై హత్యకేసు నమోదవుతోంది. అంతకుముందు నక్సలైట్ అయిన అతని సోదరిని కాపాడబోయే మరో కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసుల్ని స్పెషల్ పర్మిషన్‌తో ఇంతియాజ్ అలీ(నారా రోహిత్) డీల్ చేస్తూ సరిగ్గా రాజు కెరీర్ ఊపందుకునేసరికి జైల్లో పెట్టిస్తాడు. ఇక అందుకు కారణమైన అలీపై పగ తీర్చుకోవాలని డిసైడవుతాడు. ఆ తర్వాత పరిణామాలు ఎలా జరిగాయి? అనేది మిగిలిన సినిమా.
పెర్‌ఫార్మెన్స్:
నారా రోహిత్ 'బాణం'లో ఎలా హావభావాలు పలికించాడో ఇందులోనే అలానే వుంది. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా పోలీసు పాత్ర వేసినా మాడ్యులేషన్ ఏమాత్రం మారకపోవడం ప్రధాన లోపం. సీరియస్‌నెస్ కనబరుస్తూ రోహిత్ పోలీస్ పాత్రలో బిహేవియర్‌ను ప్రదర్శిస్తూ నటించాడు. ఆయనకు పోటీగా వుండేది రైల్వే రాజు పాత్ర. అందులో శ్రీవిష్ణు అమరాడు. ఇక హీరోయిన్ తాన్యహోప్‌కు తొలి సినిమా. క్యాజువల్‌గా చేసేసింది. మిగిలిన పాత్రలు బ్రహ్మాజీ, గిరి తదితర పాత్రలు ఓకే.
ఇది మంచి డెబ్యూగా నిలుస్తుంది. ఆమె నటన ఆకట్టుకుంది. సినిమా ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్‌గా చాలా బాగుంది. క్రికెట్ మ్యాచ్ నైపథ్యంలో శ్రీ విష్ణుని ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు బాగున్నాయి. శ్రీ విష్ణుని సపోర్ట్ చేస్తున్నట్టు ఉండే బ్రహ్మాజీ పాత్ర బాగుంది. సెకండాఫ్‌లో రోహిత్, శ్రీ విష్ణుల మధ్య నడిచే ప్రతిఘటన సన్నివేశాలు బాగున్నాయి.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ బాగానే వుంది. 90ల కాలంలోని వాతావరణాన్ని సహజంగా బాగా క్రియేట్ చేశారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్లో వేసిన సెట్ ఆకట్టుకుంది. సాయి కార్తీక్ సంగీతం ఫరవాలేదనిపించినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా కుదిరింది. సినిమా స్క్రీన్‌ప్లే కాస్త కన్‌ఫ్యూజ్‌గా వుంటుంది. దర్శకుడు శేఖర్ చంద్ర చక్కటి కథను ఎన్నుకున్నాడు. సెకండాఫ్ కథనం నెమ్మదించినా క్లైమాక్స్‌తో సినిమాకి చాలా బలాన్నిచ్చాడు.
విశ్లేషణ :
క్రికెటర్ అవ్వాలని కలలుగనే వ్యక్తి, సిన్సియర్ పోలీసు ఆఫీసర్ కథే ఇది. ఇద్దరు చుట్టూ కథ జరుగుతుంది. మధ్యమధ్యలో కొన్ని పాత్రలు సన్నివేశాలు వస్తుంటాయి. మొదటిభాగంలో అవేవీ పెద్దగా కనెక్ట్ కావు. ఈ విషయంలో దర్శకుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ చూపిస్తూ... ఇంకోవైపు రాజీవ్ కనకాల ఎపిసోడ్‌లో పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణ నేపథ్యం తీసుకుని.. కథను ఎటెటో తీసుకుపోయాడు. మొత్తంగా సినిమాలో మూడు కథలు చూపించాడు. ఎక్కువసేపు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో రాజు చేసిన త్యాగం, మరికొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తాయి. ఆ మధ్య ధోనీ సినిమాతో పాటు హిందీలో మరో సినిమా ఛాయలు ఇందులో కన్పిస్తాయి.
దర్శకుడు చాలా తెలివిగా నాలుగైదు సినిమాలను కలిపి కొత్త కథగా రాసుకున్నాడు. టైటిల్ అప్పట్లో ఒక డుండేవాడు. అని పెట్టాడు. సినిమా చూశాక.. ఎవరి గురించి చెబుతున్నాడో అర్థంకాదు. క్రికెటర్ అవ్వాలనుకునే రాజు గురించే అన్నట్లుంటుంది. ఇదే గనుక నిజమైతే.. నారా రోహిత్‌ను అభినందించాల్సిందే. ఈగోలకు పోకుండా మరో హీరోను ఎంకరేజ్‌చేసి ఆయన్ను హీరోగా చేయడం విశేషమే మరి. అయితే.. ఇది కమర్షియల్‌గా హిట్టయ్యేందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి.