పాత డాన్‌ల కలగూరగంప అజిత్ "డేవిడ్ బిల్లా"
, శుక్రవారం, 13 జులై 2012 (16:32 IST)
నటీనటులు: అజిత్, బ్రూనా అబ్దుల్లా, పార్వతి ఓమకుట్టన్, ప్రభు, రెహమాన్, మనోజ్, కె.జయన్,శ్రీరామ్ తదితరులు; సంగీతం: యువన్‌శంకర్‌రాజా, నిర్మాత: శోభారాణి, కెమెరా:ఆర్‌డి. రాజశేఖర్, కథ: చక్రితోలేటి, ఎరిక్ ఫెల్‌బర్గ్, దర్శకత్వం: వోభారాణి (తెలుగులో). సునీల్, సురేష్, జార్జి (తమిళంలో)పాయింట్: సామాన్యుడు డాన్‌గా మారడమే.ఇటువంటి కథలు సినిమాలుగా చాలా వచ్చాయి. ఆ కథలతో ఆకట్టుకోవడం కష్టంతో కూడుకున్న పనే. ఎంతో నేర్పు ఉంటేనే స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునేలా చేస్తుంది. హిందీలో డాన్, తెలుగులో యుగంధర్, ఇటీవలే ఛత్రపతి వంటి చిత్రాలు అటువంటివే. ఈ డేవిడ్ భిల్లా చిత్రం చూస్తుంటే ఆ చిత్రాలు గుర్తుకురావడం విశేషం.కథగా చెప్పాలంటే... డేవిడ్ (అజిత్) సామాన్య యువకుడు. బతుకుదెరువు కోసం గోవా చేరుకుంటాడు. ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని అందరిలా సెటిల్ అవ్వాలని ఆశయం. కానీ ఆశయానికి అడుగడునా నీరుగార్చే సంఘటనలు జరుగుతుంటాయి. దాంతో ఒక్క పూటైనా తిండి దొరకడమే కష్టమైపోతుంది. ఇక పరిస్థితుల రీత్యా తిరుగుబాటే శరణ్యమనుకుంటాడు. గెలవడానిక అడ్డదారులు తొక్కడం కరెక్టే అనుకుంటాడు. చిన్న రౌడీమూకల్ని మట్టికరిపించి అక్కడ వారికి నాయకుడిలా మారతాడు. పెద్ద డాన్ అబ్బాసీతో టచ్ ఏర్పడుతుంది. అక్కడ నుంచి డేవిడ్ ఆలోచనలు మారిపోతాయి. ఈ క్రమంలోనే పార్వతి పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది. తను బిల్లాగా ఎలా మరాడు? జీవితంలో ఏం సాధించాడు? అన్నది కథ.నటుడిగా క్యారెక్టర్‌గా తగినట్లుగా బిల్లాపాత్రలో అజిత్ అమరిపోయాడు. డాన్ చిత్రాల్లో ఉండే స్టయిలిష్‌ను బాగా పండించాడు. రెగ్యులర్‌గా తను చేసే యాక్షన్ అయినా ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తుంది. పార్వతి ఒమనకుట్టన్ పాత్ర పరిమితమే. అజిత్ అక్క కూతురుగా నటించింది. పెర్‌ఫార్మెన్స్ పరంగా పెద్దగా ఏమీలేదు. బికినీ వేసి అలరించడం మాస్‌ను ఆట్టుకుంటుంది. మిగిలిన్ డాన్ బ్యాచ్‌లో ఉన్న నటులంతా చక్కగా అమరారు. మీనాక్షి దీక్షిత్ ఐటంసాంగ్‌కు పరిమితమైంది. బ్రూనా అబ్దుల్లా పాత్ర బిల్లాలో నయనతారను పోలి ఉంటుంది. సినిమాలో ప్రధానంగా ఆకట్టుకునేది అజిత్ అభినయం. సినిమాటోగ్రఫీ, పాటలు చిత్రీకరణ బాగున్నాయి. నిర్మాణపు విలువలు అడుగడునా కన్పిస్తాయి. చక్రి తోలేటి దర్శకుడిగా కథనాన్ని సరైన విధంగా నడిపించలేకపోయాడు. కంటెంట్ చాలా పాతది. 80ల్లోని చిత్రాల తరహాలో ఉంటుంది. దాన్ని ఇప్పటి ట్రెండ్‌కు చూపలేకపోయాడు. స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లోపించడమే చిత్రానికి మైనస్‌గా ఉంది. కథ ప్రకారం... బిల్లాకు ముందు ఏం జరిగిందో చూపిస్తున్నాం అంటూ ఇదో కొత్తప్రయోగం అని చెప్పుకొచ్చారు. అయితే అదంతా పాత తరహాలో ఉండటమే ప్రధానలోపం. గ్యాంగ్‌స్టర్ చిత్రాలకు ప్రధానాకర్షణ స్టైలిష్‌గా చూపడమే. ఇటువంటి కథాంశాన్ని దర్శకుడు తీసుకోవడమే సాహసం. కొన్ని ఎమోషన్స్ కూడా పండించలేకపోయాడు. అజిత్ పరిచయం పెద్దగా ఆకట్టుకులోకపోయింది. టెక్నికల్‌గా క్లైమాక్స్‌లో 20 నిముషాలు హాలీవుడ్ సినిమాను తలపిస్తాయి. యువన్‌శంకర్ రాజా బాణీలు గొప్పగా ఏమీలేవు. ఒకేసారి 1200 థియేటర్లలో రెండు భాషల్లోనూ విడుదల చేసిన ఈ చిత్రం ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తర్వాత ఎంతమేరకు ఆడుతుందో చూడాల్సిందే.