సంక్రాంతి పందెం కోడి 'ఎవడు' వస్తున్నాడు...
, గురువారం, 26 డిశెంబరు 2013 (19:00 IST)
రామ్ చరణ్, శ్రుతి హాసన్, అమీ జాక్సన్‌లు జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించిన చిత్రం 'ఎవడు'. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. గత సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన 'నాయక్' హిట్ కావడం, అగ్ర హీరోలకి 7వ చిత్రం బ్లాక్‌బస్టర్ కావటం సెంటిమెంట్ పరంగా 'ఎవడు' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే నెం.1 ఆడియోగా ఉండటం విశేషం. ఇదిలావుండగా విడుదల సందర్భంగా జనవరి 1న స్పెషల్ టీజర్‌ను, 3న థియేటర్ ట్రైలర్స్‌ను విడుదల చేయనున్నారు.నిర్మాత మాట్లాడుతూ... ఎవడు చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే చిత్రమవుతుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అల్లు అర్జున్ పది నిముషాలు కన్పించినా ఇంపాక్ట్ సినిమా మొత్తం కన్పిస్తుంది. సినిమా చూశాక యూనిట్ అంతా హ్యాపీగా ఫీలయ్యాం. అందరికీ మంచి పేరు వస్తుంది' అన్నారు.సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటన, బన్నీ ఎప్పిరియన్స్ అదిరిపోతాయి. కాజల్ చేసింది చిన్న పాత్ర అయినా గుర్తుండిపోతుంది. సంక్రాంతికి సినిమా విడుదలవుతుంది అన్నారు. ఇంకా జయసుధ, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్, సాయికుమార్, సుప్రీత్ తదితరులు నటించారు. కథ: వంశీ పైడిపల్లి, మాటలు: అబ్బూరి రవి, కథాసహకారం: హరి.