ఇటీవల తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో 'రసికుడు' పేరుతో చంద్రశేఖరా మూవీస్ పతాకంపై కె.వెంకటరెడ్డి అనువదిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 23న విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాత వెంకటరెడ్డి చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ''ఇటీవల తెలుగులో 'రసికుడు' పేరుతో అనువదించాం. ఇప్పటివరకు మా బేనర్‌పై వచ్చిన దాదాపు 30 సినిమాలకు పైగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యన్.ఎస్.రాజా హీరోగా, 8 మంది హీరోయిన్స్‌తో పాటు ప్రముఖ నటి మంజుల మరియు ఆనంద్‌రాజ్ కీలకమైన పాత్రలలో నటించారు.
ఓ అనాధను చేరదీసి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది ఓ తల్లి. కానీ అనాధ సైకోగా మారి వెరైటీగా హత్యలు చేస్తుంటాడు. సైకోగా మారిన అనాధ మంచిగా మారాడా? పెంచి పోషించిన తల్లి తన కూతురును ఇచ్చి పెళ్లి చేసిందా లేదా? అన్నది సస్పెన్స్‌తో సాగే శృంగారభరిత చిత్రమిది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. మే 23న ఈ సినిమాను అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నాం. ఇందులో నాలుగు పాటలు సంగీతం పరంగా, సిచ్యువేషన్ పరంగా, రొమాంటిక్‌గా వుంటాయి... అని అన్నారు.
ఈ చిత్రంలో యన్.ఎస్.రాజా హీరోగా శ్రావ్య, దివ్య, సోనియా, రాణి, స్వప్న మరియు ప్రముఖ నటి మంజుల, ఆనంద్‌రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి పాటలు: సాయిరమేష్, పాటలు: పోందూరి, సంగీతం: రమేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యన్.ఎస్.రాజా, నిర్మాత: కె.వెంకటరెడ్డి.